MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..

Read Time:  1 min
MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..
FONT SIZE
GET APP
MLC Nagababu: Eating Swami's money does not just make the sin go away..
MLC Nagababu: Eating Swami’s money does not just make the sin go away..

MLC Nagababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై వెలుగులోకి వచ్చిన అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. అపవిత్ర పనులు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు.

Read Also: Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

ఖర్మ వదిలిపెట్టదు

శ్రీవారి సొమ్మును ఏ రూపంలో తిన్నా అది పాపమేనని నాగబాబు పేర్కొన్నారు. “లడ్డూ కల్తీ చేసినా, నెయ్యిలో అపవిత్రతకు పాల్పడినా, చివరకు దర్శన టిక్కెట్ల రూపంలో అక్రమాలకు పాల్పడినా.. ఆ వేంకటేశ్వర స్వామి ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన తప్పుకు తగ్గ ఫలితాన్ని అనుభవించక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

దేవుడి విషయంలో అపచారం చేసిన వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందాలని నాగబాబు సూచించారు. “చేసిన తప్పును ఒప్పుకుని, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతూ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేనిపక్షంలో దైవ ఆగ్రహానికి గురికాక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.