📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medical Reservation : ప్రభుత్వ వైద్యులకు పిజి వైద్యవిద్యలో రిజర్వేషన్ – సిఎం చంద్రబాబు ప్రకటన

Author Icon By Shravan
Updated: August 5, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ (Medical Reservation) కోటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. 2028-29 సంవత్సరంలో ప్రభుత్వాసుపత్రుల్లో క్లినికల్ మరియు నాన్ క్లినికల్ స్పెషలిస్టుల అవసరాలను మదింపు చేసి ప్రభుత్వం రిజర్వేషన్ కోటాపై నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో (పి హెచ్ సీ లు ) పనిచేసే వైద్యుల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ కోటా (Reservation kota) విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. 7 క్లినికల్ కోర్సుల్లో 15 రిజర్వేషన్ 202526 సంవత్సరంలో జరిగే పి. జి. వైద్య విద్య కోర్సుల్లో జరిగే ప్రవేశాలల్లో 7 క్లినికల్ సబ్జెక్టుల్లో ప్రభుత్వ పిహెచ్ సీ వైద్యులకు 15 రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఎనస్తీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు రైడియాలజీ కోర్సుల్లో ఈ మేరకు రిజర్వేషన్ కల్పించారు. మొత్తం 17 కోర్సుల్లో పి. జి ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశాలు జరిగే మొత్తం 9నాన్ క్లినికల్ కోర్సులో 30 రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విభాగాలు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయో కెమిస్ట్రీ, ఏనాటమీ, ఫిజీయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, మైక్రోయ్బాలజీ, పాథాలజీ, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. 1144 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే 2288 వైద్యుల ఆశలు, ఆకాంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి తో కూడిన ఆరుగురు ఉన్నతాధికారుల కమిటీ 2028 29 సంవత్సరంలో స్పెషలిస్ట్ ల అవసరం పై మదింపు చేసి వివిధ విభాగాల్లో అవసరాలను గుర్తిస్తూ నివేదిక ఇచ్చిందని మంత్రి వివరించారు. ఉన్నత విద్య పాందాలనే ప్రభుత్వ వైద్యుల ఆశలు, ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అవసరాల కంటే ఎక్కువగా ప్రభుత్వ వైద్యులకు పి.జి కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆరోగ్యశాఖా మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా ) కింద లభించే 50 పి.జి కోర్సుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ కోటా మేరకు ప్రభుత్వ వైద్యులకు ప్రవేశాలు లభిస్తాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/rdt-when-will-rdt-get-permits/andhra-pradesh/526342/

AP medical seats Breaking News in Telugu Government doctors quota Latest News in Telugu Medical Education PG medical reservation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.