📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Medaram Jatara: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం

Author Icon By Rajitha
Updated: February 23, 2026 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జాతర ముగిసినా తగ్గని భక్తుల ప్రవాహం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ముగిసి దాదాపు ఇరవై రోజులు గడిచినా భక్తుల రాక తగ్గడం లేదు. ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తున్నారు. గద్దెల ప్రాంగణం ఉదయం నుంచే సందడిగా మారుతోంది. జాతర వాతావరణం మళ్లీ నెలకొన్నట్టు కనిపిస్తోంది.

Read also: Utnoor Bus Accident: వాగులో పడిపోయిన బస్సు.. పలువురికి గాయాలు

Devotees flock to see Sammakka-Saralamma

జంపన్న వాగులో పుణ్యస్నానం.. గద్దెల వద్ద మొక్కుల చెల్లింపు

భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి నాగులమ్మ, జంపన్న గద్దెల వద్ద ముడుపులు కడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తలనీలాలు అర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పిస్తున్నారు. గద్దెల పరిసరాల్లో రహదారులు వాహనాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

హుండీల లెక్కింపు పూర్తి.. కోట్లలో ఆదాయం

జాతర అనంతరం హుండీల లెక్కింపు హనుమకొండలో నిర్వహించారు. మొత్తం 828 హుండీలను ఏడు రోజుల పాటు లెక్కించి రూ.13.25 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు విదేశీ కరెన్సీ, వెండి, బంగారు ఆభరణాలు కూడా లభించాయి. ఈ ప్రక్రియలో ఎండోమెంట్ శాఖ పర్యవేక్షణలో సుమారు 400 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు మంచి స్పందన లభించింది. మహిళలు వేలల్లో లాభాలు ఆర్జించినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jampanna Vagu snanam Latest News in Telugu Medaram latest news Sammakka Saralamma Jatara

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.