📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Mantena Ramaraju: టీటీడీకి మంతెన రామరాజు 9 కోట్ల విరాళం

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారికి ఎన్నారై మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) ఏకంగా రూ.9కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పీఏసి 1, 2,3 భవనాల అధునీకరణకు రూ.9 కోట్లు విరాళం ఇచ్చారు. మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట ఈ విరాళాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో విరాళం అందజేశారు.

Read Also: CM Chandrababu: అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు

Mantena Ramaraju donates Rs 9 crore to TTD

సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేశారు. ఇటీవల రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజు వివాహ మహోత్సవం ఉదయ్‌పుర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రామలింగరాజు మంతెన టీటీడీ (TTD) కి భారీగా విరాళం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2012వ సంవత్సరంలోనూ ఆయన రూ.16 కోట్లను విరాళంగా అందజేశారు. కాగా, ఇటీవల ఆయన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజుల వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

NRI donation Ramalingaraju Mantenna tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.