తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple) భక్తుల ఆధ్యాత్మిక ప్రేరణకు నిలయంగా నిలుస్తోంది. ఈ దేవాలయాన్ని తరచూ “తెలంగాణ తిరుపతి”గా పిలుస్తుంటారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. కొందరు తమ మనసులోని కోరికలు తీర్చబడిన తర్వాత విరాళాల రూపంలో ధనాన్ని, బంగారాన్ని, ఆస్తులను సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. తాజాగా యాదగిరిగుట్టలో మరో విశేష సంఘటన చోటుచేసుకుంది.
ఓ భక్తుడు స్వామివారిపై తన అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సుమారు రూ.4 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని అధికారికంగా ఆలయ ఎండౌమెంట్స్ విభాగానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఆ భక్తుడి భక్తి భావాన్ని కొనియాడారు. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని సమర్పించడం భక్తి పరాకాష్టకు నిదర్శనం అని వారు పేర్కొన్నారు.ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఒకరు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలాయానికి రూ.4 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా అందించారు.
రెండేళ్ల క్రితం ఓ భక్తుడు నర్సన్నకు భారీ మొత్తంలో
దేవస్థానం అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముత్తినేని వెంకటేశ్వర్లు అనే విశ్రాంత ఉద్యోగి.. హైదరాబాద్‌లో ఉన్న తన మూడంతస్తుల ఇంటిని యాదాద్రి ఆలయానికి దానం చేశారు. వెంకటేశ్వర్లు ఇల్లు.. తిలక్‌నగర్ (Tilaknagar) లో ఉంది. 152 గజాల ఇంటిని నర్సన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. గురువారం ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో.. చిక్కడపల్లిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు.అనంతరం ఇంటి పత్రాల్ని ఆలయ ఈవో వెంకట్రావుకు అందించారు.
ఈ సందర్భంగా ఈవో.. దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానించి.. ఆయనకి స్వారి వారి ప్రసాదం అందించారు. దాతను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యకార్యదర్శి కూడా అభినందించారు. రెండేళ్ల క్రితం ఓ భక్తుడు నర్సన్నకు భారీ మొత్తంలో బంగారం విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ఆయనే మై హోం గ్రూప్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరావు. యాదాద్రి స్వామివారి ప్రధానాలయ గర్భగుడిపై ఏర్పాటు చేసిన విమాన గోపురానికి స్వర్ణ తాపడం జూపల్లి రామేశ్వరావు 5 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. చినజీయర్ చేతుల మీదుగా బంగారాన్ని ఆలయ ఈవోకు అందజేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: