Latest News: Tirupati – 22నుంచి తాతయ్యగుంట గంగమ్మకు నవరాత్రి మహోత్సవాలు

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

తిరుపతి : రాయలసీమ జిల్లాల్లోనే ఎంతో ప్రాశస్త్యం కలిగిన, తిరుపతి నగరగ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయం (Thathayyagunta Gangamma Temple) లో ఈనెల 22వతేదీ నుండి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ తొమ్మిదిరోజులు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో గంగమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గంగమ్మ ఆలయంలో ఉభయదారులు భక్తులకు సేవలందిస్తారు. 22వతేదీ సోమవారం ఉదయం శుక్లపాడ్యమిరోజు మహాగణపతిపూజ, కలశస్థా పనతో ఆరంభమవుతాయి.

Latest News
Latest News

రాజరాజేశ్వరిదేవి అలంకారంలో

23వతేదీ మంగళవారం బాలత్రిపురసుందరీదేవి ఆలంకారం (Balatripurasundari Devi’s decoration) లో, 24వ తేదీ గాయత్రిదేవి అలంకారం, 25న అన్న పూర్ణాదేవి ఆలంకారం, 26న మహాలక్ష్మీదేవిగా, 27న లలితాత్రిపురసుందరిదేవిగా, వారాహిదేవిగా, 29న సరస్వతిదేవి అలంకారంలో, సెప్టెంబర్ 30న దుర్గాదేవిగా, అక్టోబర్ 1వతేదీ మహిషాసురమర్దినీదేవి అలంకారంలో, 2వతేదీ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో గంగమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ఆ తొమ్మిదిరోజులు ప్రతిరోజూ ఉదయం 7గంటలకు అభిషేకం, 8గంటలకు హోమం, 9గంటలకు సహస్రనామార్చన, సాయంత్రం 6.30గంటలకు ఊంజల్సేవ ఉంటుంది. భక్తులు దేవీనవరాత్రుల్లో అమ్మ వారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆలయ ఇఒ జయకుమార్ కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-ganesh-festival-ycp-conspiracy-to-destroy-hinduism/andhra-pradesh/543097/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.