📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Temples దేవాలయాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది హవా.. పట్టించుకోని అధికారులు

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : దేవాదాయ శాఖ పరిధిలోని పలు పెద్ద దేవాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. రేటు పెట్టి అమ్మేసుకుంటున్నారని, ఆయా దేవాలయాలకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే ఏజెనీల ప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిన్నారని భక్తులు విమర్శిస్తున్నారు. శానిటేషన్, ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, పర్యవేక్షణ. ఇలా పలు రకాల పనుల కోసం ఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని “తీసుకుంటుండగా ఆ బాధ్యతను నిర్వహించకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ పద్దతిలో మ్యాన్వవర్ నప్లయింగ్ సంస్థ (Manpower supply company) లకు కట్టబెట్టి చేతులు దులుపుకొంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీలు సిబ్బందీని నియమించే విషయంపై అధికారులు దృష్టి సారించకపోవవడంతో అంతా అస్తవ్యస్తంగా తయారైందని భక్తులు ఆరోపిస్తున్నారు.

ప్రసాదాల తయారీ పోస్టు అయితే

దేవాలయాల వారీగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఆయా ఏజెన్సీలు కొందరు ప్రతినిధులను నియమిస్తుండగా ఆ ప్రతినిధులు కూడా ఔట్ సోర్సింగ్ ఖాతాలోనే నియమితులవుతూ నెలవారీ జీతాన్ని పొందుతున్నారు. కానీ, వారిలో చాలామంది అసలు చెందా మాత్రం పోస్టులను బేరానికి పెట్టి డబ్బులు వసూలు చేయటమే ప్రసాద తయారీ,కౌంటర్ పోస్టు కావాలంటే 2.25 లక్షలు, ప్రసాదాల తయారీ పోస్టు అయితే రూ.2 లక్షలు, శానిటేషన్ విభాగం (Sanitation Department) లో అయితే రూ.1.80 లక్షలు ఈ విధంగా ధరల పట్టికను ఏర్పాటు చేసుకుని వసూళ్ళకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన వారిని మాట్లాడి ఉద్యోగాలు కేటాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదంతా ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దేవాదాయశాఖ అధికారులు పట్టిచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Latest News

దేవాదాయశాఖలో నియమకాలు

ఇటీవల కొన్ని దేవాలయాలకు సంబంధించిన ఏజెన్సీ ప్రతినిధులు, నిరుద్యోగుల మధ్య సాగిన ఫోన్కాల్ రికార్డులు వెలుగులోకి రావడంతో దీని పెద్ద దుమారం రేగింది. పెద్ద దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అక్కడ సేవలను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది అవసరం పెరుగుతోంది. ప్రస్తుతం దేవాదాయశాఖలో నియమకాలు లేకపోవడంతో అవసరమైన సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్దతిలో తీసుకుంటున్నారు. దాంతో అన్ని దేవాలయాల్లో వీరి సంఖ్య భారీగా పెరిగింది. దేవాలయాల్లో ప్రసాదాల అమ్మకాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటోంది. దర్శనం అనంతరం ప్రసాదం స్వీకరించడం తప్పని సరని భక్తులు భావిస్తున్నారు. తినే పదార్థాలు కావడంతో ప్రసాదాల తయారీలో పరిశుభ్రత చర్యలు అత్యవసరం, కానీ, ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు దీనిని పట్టించుకోవటంతో శానిటేషన్ విధుల్లో ఉండే సిబ్బందిని ప్రసాదాల తయారీకి పురమాయిస్తున్నారు.

ప్రసాదాల తయారీ

ప్రసాదాల తయారీ సమయంలో తలపై క్యాప్ (జుట్టు రాలిపడకుండా) చేతులకు గ్లోవ్స్ ధరించటంతోపాటు చేతి గోళ్లు పెరిగి ఉండకూ డదని, రోజూ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలనే నిబంధ నలుంటాయి. కానీ, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో గోశాలల్లో పేద ఎత్తే విధుల్లో ఉండేవారిని ప్రసాదాల తయారీకి మారుస్తున్నారు. వారి చేతి గోళ్లలో పేడ ఇరుక్కొని ఉంటె ప్రసాదం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుందని భక్తులు ఆమె దన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ విధుల్లో ఉండే వారినా ప్రసాదాల తయారీ, ప్రసాదాల కౌంటర్లకు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. విధుల్లోకి ఎంపిక చేసే వారికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కచ్చితంగా విచారణ జరపాలన్న నిబంధన ఆపహాస్యమవుతోంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడో వాకబు చేయ కుండానే దేవాలయాల్లో కీలక బాధ్యత అప్పగిస్తున్నారని. ఈ నేపథ్యంలో అన్యమతస్తులు కూడా దేవాలయ విధుల్లో వస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-minister-ponnam-prabhakar-janahita-padayatra-should-be-made-a-success-minister-ponnam/telangana/534201/

Breaking News Endowments Department Hyderabad News latest news manpower supply agencies outsourcing jobs Telugu News temple management

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.