చార్ధామ్ యాత్రలో ప్రధానమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఈ ఏడాది మే 2న తెరువనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ప్రతి ఏడాది వర్షాకాలం మరియు చలికాలం సమయంలో తీవ్రమైన మంచు కారణంగా ఈ ఆలయాలు మూసివేయబడతాయి. వేసవిలో మంచు కరుగుతున్న సమయంలో కొద్ది రోజులపాటు మాత్రమే ఈ ఆలయాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. దీంతో భక్తులు ఈ పుణ్యక్షేత్ర దర్శనానికి ముందుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
మే 4న బద్రీనాథ్ ఆలయం ఓపెన్
అలాగే మరో ముఖ్యమైన తీర్థక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయం మే 4న భక్తులకు తెరచనున్నది. ఇది హిమాలయాల్లో అత్యంత పవిత్రమైన ఆలయంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ యాత్రలో భాగంగా ఈ ఆలయాలను దర్శించుకుంటారు. ఈ యాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
మే 21న కేదార్‌గా పిలవబడే మద్మహేశ్వర్ ఆలయం ఓపెన్
వాటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్మహేశ్వర్ ఆలయం మే 21న, మూడో కేదార్‌గా ప్రసిద్ధి చెందిన తుంగనాథ్ ఆలయం మే 2న తెరువనున్నారు. ఈ ఆలయాలు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉండటంతో పాటు ప్రకృతితో మమేకమైన పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. హిమాలయాల్లో ఈ యాత్ర భక్తులకు ఒక జీవితానుభూతి కలిగించే విధంగా ఉంటుంది.