Kadiri Rathotsavam Accident: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మ రథోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలో రథాన్ని లాగుతున్న సమయంలో ఒక్కసారిగా అపశృతి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య రథం కదులుతుండగా, ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ రథం చక్రం కింద పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు భక్తుడికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత
క్షతగాత్రులకు చికిత్స.. ఆసుపత్రికి తరలింపు
ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు భక్తులు కూడా గాయపడ్డారు. రథం వేగంగా కదులుతుండటం, జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :