📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Janmashtami 2025: మన దేశంలో తప్పనిసరిగా చూడాల్సిన రాధా కృష్ణుల ఆలయాలు ఇవే!

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం ఆధ్యాత్మిక సంపదతో ప్రసిద్ధి చెందిన దేశం. ఇక్కడ ప్రతి ప్రాంతంలోనూ అనేక ఆలయాలు, తీర్థక్షేత్రాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా రాధా కృష్ణుల ఆలయాలు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. రాధా-కృష్ణుల భక్తి, భక్తి మార్గంలో భగవంతుని సాక్షాత్కారం, జీవనోద్దేశ్యం గురించి తెలిపే ఆధ్యాత్మికతను విస్తృతంగా వ్యాప్తి చేసింది. అందుకే దేశవ్యాప్తంగా ఈ ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. మన దేశంలో తప్పక చూడాల్సిన కొన్ని ప్రముఖ రాధా కృష్ణుల ఆలయాలు ఇవే.

రాధా కృష్ణుల వివాహ స్థలి 

ఇది రాధాదేవి శ్రీకృష్ణుని నిలయం. ఇది ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని భండిర్వన్‌లో ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ రాధా, కృష్ణులు బ్రహ్మ సమక్షంలో వివాహం చేసుకున్నారని నమ్ముతారు. 

ప్రేమ్ మందిరం

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా సమీపంలోని బృందావనంలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాధా-కృష్ణ ఆలయాలలో ఒకటి. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం.. తెల్లని ఇటాలియన్ పాలరాయితో నిర్మించబడింది.

శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయం 

బృందావనం లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది నాగర శైలిలో నిర్మించబడింది. యమునా నది ఒడ్డున ఉంది. కాలియా ఘాట్‌కు దగ్గరగా 50 అడుగుల ఎత్తులో ఉంది . 

శ్రీ రాధా రామన్ ఆలయం

బృందావనంలో ఉన్న మరొక ఆలయం. దీనిని మదన్ మోహన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ద్వాదశాదిత్య కొండపై ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది.. 

 శ్రీ రాధా దామోదర్ ఆలయం

 బృందావనంలోని అత్యంత పవిత్రమైనది. పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 1542లో శ్రీల జీవ గోస్వామి స్థాపించారు. ఇది గౌడియ వైష్ణవ సంప్రదాయానికి చెందినది. 

శ్రీ శ్రీ రాధా రసబిహారి ఆలయం

ముంబైలోని జుహులో ఉన్న ఒక అద్భుతమైన పాలరాయి ఆలయ సముదాయం. తెలుపు, ఎరుపు పాలరాయితో అందంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఇస్కాన్ ఆలయం, శ్రీ శ్రీ రాధా రసబిహారి ఆలయం, హరే రామ హరే కృష్ణ దేవాలయం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది.

శ్రీ రాధావల్లభ్ లాల్ జీ ఆలయం 

రాధావల్లభ ఆలయం అని కూడా పిలుస్తారు. 16వ శతాబ్దంలో స్థాపించబడిన పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీ హిట్ హరివంశ మహాప్రభువు నిర్మించాడు. ఈ ఆలయంలో రాధా వల్లభ సంప్రదాయం చాలా ముఖ్యమైనది. 

Breaking News Devotion Hindu Spirituality India Spiritual Heritage latest news Pilgrimage Sites Radha Krishna Temples Telugu News Temples of India Vrindavan Temples

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.