📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jagannath Yatra: జగన్నాథ రథయాత్రలో భక్తుల పైకి దూసుకెళ్లిన ఏనుగు

Author Icon By Sharanya
Updated: June 27, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలోని వలసాడ్ జిల్లా గోల్‌వాడ సమీపంలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో విషాద ఘటన చోటుచేసుకుంది. భక్తుల సందడి మధ్య రథయాత్ర శోభాయాత్రగా సాగుతుండగా, ఒక్కసారిగా యాత్రలో భాగంగా ఉన్న ఒక ఏనుగు భయంతో విరుచుకుపడింది. నియంత్రణ కోల్పోయిన ఆ ఏనుగు భక్తులపైకి దూసుకెళ్లడంతో తొక్కిసలాట నెలకొంది. పలువురు గాయపడగా, కొందరు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏనుగు దాడి ఎలా జరిగింది?

యాత్రలో భాగంగా పూజాకార్యక్రమాలు జరుగుతుండగా, యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.

గాయపడిన భక్తుల పరిస్థితి

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి గంభీరంగా ఉందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పూరీ రథయాత్రలో విశేషాలు

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవుళ్లు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్​27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది.

భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం

ఈ కార్యక్రమాన్ని లక్షలాది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావడంతో, పూరీ పట్టణంలో భద్రతా వ్యవస్థను అధికారం విస్తృతంగా మోహరించారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అధికారులు 10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. వీరిలో ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్​డ్​ ఫోర్స్​ (సీఏపీఎఫ్)కు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నిఘా కోసం పోలీసులు పూరీ పట్టణంలో 250కి పైగా ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​-ఎనేబుల్డ్ కెమెరాలు అమర్చారు.

https://twitter.com/shahcastic/status/1938491255471710489?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1938491255471710489%7Ctwgr%5E26211e85783e408585d8e9665f7fbcd6902b110f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Fnational%2Felephants-in-ahmedabad-rath-yatra-runs-amok-on-street-several-injured-9442185

Read also: Jagannath Rath Yatra: పూరీలో ఘనంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

#elephantattack #Gujarat #JagannathRathYatra2025 #JagannathYatra #PuriYatra #TempleFestivals Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.