Indrakeeladri : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19ను మాఘమాసం(Magha Masam) ప్రారంభం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. రు.1000ల ఉభయ రుసుము తో దంపతులు పాల్గొనవచ్చన్నారు. అలాగే ఈనెల 23 వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు.
Read Also: Medaram : మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!
విద్యార్థులకు ఉచిత దర్శనం ఏర్పాటు
ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటల వరకు యూనిఫారం, గుర్తింపు కార్డుతో వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ఉచిత దర్శనం(Special Pujas) ఏర్పాటు చేశామన్నారు. అలాగే వారికి 6వ అంతస్థులో శ్రీ అమ్మవారి ప్రసాదంగా పెన్ను, లడ్డూ ప్రసాదం, శక్తికంకణం, శ్రీ అమ్మవారి ఫోటో అందిస్తామన్నారు. 6వ అంతస్థులో ఉచితంగా 500 మందికి అక్షరాభ్యాసం చేసే అవకాశం కల్పిస్తామన్నారు.
శ్రీ సరస్వతి మాతగా దర్శనమిచ్చే దుర్గమ్మ
ఈ సందర్భంగా దుర్గమ్మవారు జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతి మాతగా దర్శనమిస్తారన్నారు. అలాగే సరస్వతి హోమం నిర్వహిస్తామన్నారు. దుర్గమ్మవారి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన చండీహోమం, సూర్య ఉపాసన సేవలో పెద్ద ఎద్దఎత్తున పాల్గొన్నారు. శ్రీ స్వామివారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: