Indrakeeladri : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 13 (శుక్రవారం) నుండి 17 (మంగళవారం) వరకు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు, 18 బుధవారం నుండి 20 శుక్రవారం వరకు ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవలు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో 13న ఉదయం 8 గంటలకు ఎ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి(Malleshwara Swamy) ఉత్సవరులకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట, సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనం, అంకురార్పణ మండపారాధన కలశ స్థాపన ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు బలిహరణ హారతి మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వినియోగం, 14,15తేదీల్లో ప్రతి రోజు ఉదయం సాయంత్రం నిత్య పూజలు నిర్వహణ.
Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
లింగోద్భవ కాల అభిషేకము మహా నివేదన హారతి
అనంతరం 15న ఆదివారం రాత్రి 9 గంటలకు మహాన్యాసం, లింగోద్భవ కాల అభిషేకము మహా నివేదన హారతి మంత్ర పుష్పముల తదుపరి “శ్రీ గంగా కనకదుర్గా సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవము” 16న సోమవారం నిత్య పూజలు అనంతరం సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా కనకదుర్గా నగర్ మీదుగా బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్, కెనాల్ రోడ్డు మీదుగా రధోత్సవము కనకదుర్గా నగర్ మీదుగా శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి చేరుకుంటుంది. 17న మంగళవారం ఉదయం 10 గంట లకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవము అనంతరం దుర్గా ఘాట్లో అవభృతోత్సవము, ద్వజావరోహణము నిర్వహించబడతాయి.
అమ్మవార్ల కళ్యాణోత్సవ ఆర్జిత సేవ
18 నుండి 20 వరకు పంచ హారతులు ద్వాదశ ప్రదక్షిణలు అనంతరం పవళింపు సేవ నిర్వహించబడతాయని ఆలయ ఈవో శీనానాయక్ తెలియపరిచారు. 15న మహాశివరాత్రి రోజు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనుటకు దంపతులకు ఉభయ రుసుము రూ.1,116/-లుగా నిర్ణయించడమైనది.
పాల్గొన్న భక్తులకు శేషవస్త్రము, రవిక, శ్రీచక్ర లడ్డు ప్రసాదము అందచేస్తారు. నిత్యాన్నదాన విరాళ దాతలు: ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిత్యము నిర్వహించే నిరతాన్నదాన పథకమునకు హైదరాబాద్ వాస్తవ్యులు చల్లా చంద్రమౌళి, సరోజిని దంపతులు రూ.1,00,000/-లు విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు (గాంధీ) అందచేశారు. వారికి ఆలయంలో అమ్మవార్ల దర్శనానంతరం వేద పండితులచే వేదాశీర్వచనం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం తీర్ధప్రసాదములు అందచేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: