దీపారాధన నిర్వహించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు(Hindu Traditions) సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతరుల అగ్గిపెట్టెను ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు. ఇది శుభకరం కాదని, అలా చేస్తే దీపారాధన ద్వారా లభించే పుణ్యఫలం మనకు కాకుండా ఇతరులకు చేరుతుందనే నమ్మకం ఉంది.
Read Also: SuryaDev:మనకు కనిపించే సూర్యుడే ఒక్కటేనా? 12 సూర్యుల కథ
వెలుగుతున్న ఇతర దీపాలతో దీపం వెలిగించరాదు
ఇప్పటికే వెలుగుతున్న ఇతరుల దీపాల నుంచి దీపాన్ని వెలిగించడం కూడా తగదని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. దీపారాధన కోసం(Hindu Traditions) స్వయంగా కొనుగోలు చేసిన అగ్గిపెట్టెతోనే దీపం వెలిగించడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. స్నేహితులు లేదా బంధువులతో కలిసి గుడికి వెళ్లినప్పుడు కూడా పూజకు అవసరమైన సామగ్రిని సొంత ఖర్చుతోనే కొనుగోలు చేయడం ఉత్తమం అని పండితుల అభిప్రాయం. అలా చేసినప్పుడే ఆ పూజకు సంబంధించిన పుణ్యఫలం పూర్తిగా మనకే దక్కుతుందని చెబుతున్నారు.
నియమాలతోనే ఆధ్యాత్మిక ఫలితం
ఈ చిన్నచిన్న నియమాలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక సంతృప్తి, శుభఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తున్నారు. దీపారాధన కేవలం ఆచారం మాత్రమే కాకుండా, నియమ నిష్ఠతో చేసే భక్తి ప్రక్రియగా భావించాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: