Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష

Read Time:  1 min
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
FONT SIZE
GET APP

Godavari Pushkaralu: వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు భద్రతా ఏర్పాట్లపై డిజిపి శివధర్ రెడ్డి బుధవారం నాడు డిజిపి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైల జా రామయ్యర్, శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల ఎసి పిలు, కమిషనర్లలో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని కోరారు.

Read also: Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత!

Godavari Pushkaralu: DGP reviews Godavari Pushkaralu
Godavari Pushkaralu: DGP reviews Godavari Pushkaralu

మొదటిసారి జరుగుతున్న రెండవ గోదావరి పుష్కరాలు

గోదావరి నదీ తీరం వెంట వున్న జిల్లాల పోలీసు అధికారులు ఈ విషయంలో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటిసారి జరుగుతున్న రెండవ గోదావరి పుష్కరాలు ఇదే కావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. మేడారం జాతరలో వాడిన సాంకేతికతను గోదావరి పుష్కరాలకు వాడాలని ఆయన కోరారు. గోదావరి నది ప్రవహించే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం తదితర జిల్లాలలో పనులను వెంటనే ప్రారంభించాలని డిజిపి ఆదేశించారు.

టోర్నమెంట్ నిర్వహణకు సమయం

ఈ సమావేశంలో ఐజిలు చంద్రశేఖర్ రెడ్డి, గజారావు భూపాల్, ఏఐజి రమణ పాల్గొన్నారు.
పోలీస్ ఫుట్బాల్ టోర్నమెంట్పై సమీక్ష: ఇదిలా వుండగా వచ్చే మార్చి 23వ తేదీ నుంచి హైదరాబాద్లో జరగనున్న 74వ బిఎన్ ము ల్లిక్ అఖిల భారత పోలీసు ఫుట్బాల్ టోర్నమెంట్ ని ర్వహణపైనా డిజిపి సమీక్షించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సమయం దగ్గర పడు తుండడంతో ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఇందుకోసం ఏర్పాటైన కమిటీలను ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పా టు పారా మిలటరీ విభాగాల జట్లు ఇందులో పాల్గొంటున్నాయని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన కోరారు.

హైదరాబాద్ కు వచ్చే గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్న డిజిపి శివధర్ రెడ్డి. చిత్రంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్ తదితరులున్నారు. జట్లకు ఘన స్వాగతం పలకాలని, వారి వెంట హిం దీ, ఇంగ్లీష్ భాషలు తెలిసిన వారిని లైజనింగ్ అధికారులుగా నియమించాలని డిజిపి కోరారు. మ్యాచ్ల కోసం వచ్చే జట్లు తిరిగి వెళ్లేంత వరకు లై జనింగ్ అధి కారులు వారి వెంట వుండాలని ఆయన తెలిపారు. సమా వేశంలో పోలీసు అకాడమీ డైరక్టర్ అభిలాష్ బిస్త్, శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్, గ్రే హౌండ్స్ అదనపు డిజి అనిల్ కుమార్, ఐజిలు గజారావు భూపాల్ సైబ రాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు రమేష్, అవినాష్ మొహంత సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.