📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EO Anil Kumar: టీటీడీ ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం

Author Icon By Tejaswini Y
Updated: January 20, 2026 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ: ఈ ఏడాది మార్చి చివరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు రోజుకు రెండుసార్లు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్(EO Anil Kumar) వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read also: Magha masam: ఆధ్యాత్మికంగా విశిష్టమైన శుభ కాలం

EO Anil Kumar: Annaprasadam is served twice a day in TTD temples

గౌహతి నుంచి కోయంబత్తూరు వరకు శ్రీవారి ఆలయాలు

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇప్పటివరకు కొద్దిపాటి ఆలయాల్లో పరిమితంగా ఉన్న అన్నప్రసాద వితరణను, ఇకపై అన్ని టీటీడీ ఆలయాల(Tirumala Tirupati Temples)కు విస్తరించనున్నారు. దీనివల్ల రోజూ వేలాది మంది భక్తులకు అన్నదానం చేసే అవకాశం ఏర్పడనుంది. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ముందడుగు వేస్తోందని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గౌహతి, పాట్నా, కోయంబత్తూరు, బెల్గాం నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూములను ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఆలయాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు కూడా తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని కల్పించాలన్నదే లక్ష్యమని చెప్పారు.

టీటీడీ ఏఈ పోస్టులకు పరీక్షలు

అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపడతామని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Annadanam Scheme Tirumala Tirupati Devasthanams TTD Annadanam TTD temples

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.