📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: EO AK Singhal -గడువులోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి కావాలి

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టిటిడి నూతన ఇఒ ఎకెసింఘాల్

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవా లకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉందని, గడువులోపు అన్ని ఏర్పాట్లు పూర్తికావాలని టిటిడి  (TTD) నూతన 22 అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.. మెరుగైన ఏర్పాట్లు, పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామని ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. భక్తులకు అందించే సేవలతో బాటు విధానపరమైన నిర్ణయాలలో టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమష్టిగా నిర్ణయం తీసుకుని భక్తులకు వేగంగా,

నాణ్యమైన సేవలందిద్దామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chief Minister Chandrababu Naidu) సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తృతపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలందించాలో అందరూ కలసి పనిచేద్దామన్నారు.

తొలిసారిగా అన్నమయ్యభవనంలో

టిటిడి నూతన ఇఒగా అనిల్కుమార్సింఘాల్ (Anil Kumar Singhal EO) బుధవారం ఉదయం బాధ్యలు చేపట్టిన తరువాత మధ్యాహ్నం తొలిసారిగా అన్నమయ్యభవనంలో టిటిడిలోని విభాగాధిపతులు అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎసీఒ కెవి మురళీకృష్ణ, అదనపు సివిఎస్, శివకుమార్రెడ్డి, ఎఫ్ఎసిఎఒ బాలాజీ,

 EO AK Singha

డిప్యూటీ ఇఒలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, సోమన్నారాయణ, ఓఎస్గా సత్రానాయక్, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఆయన పరిచయ కార్యక్రమం, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఇఒ సింఘాల్ మాట్లాడుతూ కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, బాధ్యతగా సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమలుచేసే అంశంపై దృష్టిపెట్టాలన్నారు

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలన్నారు. టిటిడి చైర్మన్ సూచించే సూచనలు సలహాలు, బోర్డు సభ్యులు, డయల్ యువర్ 22, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయసేకరణ, సర్వేలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. అభిప్రాయసేకరణలో మార్పులు తీసుకువచ్చి మెరుగైన సేవలందిద్దామన్నారు.

వీలైనంతవరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుచేసే అంశంపై దృష్టిపెట్టాలన్నారు. టిటిడిలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని అధికారులకు ఇఒ స్పష్టం చేశారు. టిటిడిలో గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, మార్పులపై అదనపు ఇఒ వెంకయ్యచౌదరి వివరించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-j-shyamala-rao-quality-services-with-reforms-in-14-months-shyamala-rao/andhra-pradesh/545103/

annual Brahmotsavam Breaking News Devotee Services Festival Preparations latest news Telugu News temple management Tirumala arrangements Tirumala temple TTD EO Anil Kumar Singhal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.