📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Ayodhya Rama temple: అయోధ్య రామ మందిరానికి రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అయోధ్య (Ayodhya) లో శ్రీరామ జన్మభూమిపై నిర్మితమవుతున్న రామమందిరం దేశవ్యాప్తంగా భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పవిత్ర ప్రాజెక్ట్‌ కోసం దేశంలోని కోట్లాది హిందువులు తమ వంతు విరాళాలను అందించారు. రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన తాజా వివరాల ప్రకారం, 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు.

Read Also: US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

అందులో రూ.1,500 కోట్లకు పైగా నిర్మాణ కార్యకలాపాల కోసం ఇప్పటికే వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను ఆలయం అంతర్గత సదుపాయాలు, మ్యూజియం, అతిథి గృహాలు, యాత్రికుల సౌకర్యాల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు చెప్పారు.

Ayodhya Rama temple

విశేష ప్రాధాన్యం

నవంబర్ 25న రామమందిరంలో జరగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం (Flag Unveiling Ceremony) విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

ఆయనతోపాటు పలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, సన్యాసులు, ఆధ్యాత్మిక నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకకు సుమారు 8 వేల మందికి ఆహ్వానాలు పంపించనున్నట్లు కమిటీ తెలిపింది. ఆహ్వానితుల్లో ప్రముఖ దాతలు, హిందూ సంస్థల ప్రతినిధులు, మతపెద్దలు, సామాజిక సేవకులు ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Ayodhya Ram Mandir Breaking News latest news Nripendra Mishra PM Modi Ram temple donations Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.