📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Konark Temple: ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గురించి మీకు తెలుసా?

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోణార్క్ సూర్య దేవాలయం, భారత దేశ పూర్వ తీరంలోని ఓ అపూర్వ శిల్ప కళాకృతిగా నిలిచిన ఈ ఆలయం, ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ పట్టణంలో ఉంది. భువనేశ్వర్ (Bhubaneswar) నుండి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం, 13వ శతాబ్దంలో గంగ వంశాధిపతి నరసింహదేవుడు మొదటిగా నిర్మించించాడు. సూర్య భగవానుడికి అంకితమైన ఈ దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినది.

ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు

కోణార్క్ దేవాలయం శిల్పకళలో అపూర్వమైనది. ఈ ఆలయం ఒక మహత్తర రథాకార రూపంలో నిర్మించబడింది. ఇది సూర్యుడి రథాన్ని పోలి ఉంటుంది. ఈ రథానికి 12 జతల చక్రాలు (మొత్తం 24 చక్రాలు) ఉన్నాయి. ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయని నమ్మకం. ఒక్కో చక్రం 8 రేఖలతో కూడి ఉండి, గంటల సూచికలుగా పనిచేస్తాయి. ఇంకా, ఈ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్టు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి వాస్తవానికి సూర్యుని ఏడు రంగులను (VIBGYOR) సూచిస్తాయి.

Konark Temple: ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గురించి మీకు తెలుసా?

ఆలయ శిథిలావస్థ వెనుక చరిత్ర

ఈ దేవాలయం ఒకప్పుడు పూజలు, ఉత్సవాలతో ప్రఖ్యాతిగా ఉండేది. కానీ Mughal కాలంలో లేదా మరింతముందు ఆక్రమణదారుల దాడుల వల్ల ఆలయం శిథిలమైపోయింది. ప్రధాన గర్భగృహం (విమానం) నాశనం కావడం, క్రమంగా ఆలయ నిర్మాణం పాడైపోవడం జరిగింది. ప్రస్తుతం ఆలయంలో పూజలు నిర్వహించరు, కానీ ఇది పర్యాటకుల కోసం తెరవబడి ఉంది.

అయస్కాంత రాయి

ఈ దేవాలయం పైభాగంలో అయస్కాంత రాయిని ఉంచినట్లు చెబుతారు. ఆ అయస్కాంత రాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారని, ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహాన్ని (idol) కాపాడేందుకు పూజారులు పూరీకి తీసుకెళ్లారని చెబుతారు.

ప్రకృతి వైపరీత్యాల

దోపిడీ కారణంగా ఆలయం బాగా దెబ్బతినడంతో ఆలయ ప్రధాన ద్వారం ఇసుకతో కప్పబడి ఉంది. ఈ ఆలయం కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల (Natural disasters) బారిన పడింది. 18వ శతాబ్దంలో ఆలయ శిఖరం కూలిపోయిందని, ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిని మూసివేశారని చెబుతారు.

మీకు తెలియని నిజాలు

చక్రాలు సమయాన్ని చూపతాయి: ఆలయానికి చెందిన చక్రాలను సూర్యకాంతితో సమన్వయం చేసి గంటలు, నిమిషాలు తెలుసుకునే విధంగా రూపొందించారని శాస్త్రవేత్తలు (Scientists) చెబుతారు.

మ్యాగ్నెటిక్ స్టోన్ కథ: ఒక కధనం ప్రకారం ఆలయంలో గర్భగృహం వద్ద ఒక భారీ కాంతిమంతమైన మెగ్నెట్ రాయిని ఉపయోగించి సూర్య దేవుని విగ్రహాన్ని (Idol of Sun God) గాల్లో తేలినట్లుగా ఉంచినట్టు చెబుతారు. కానీ అది కాలక్రమేణా తొలగించబడింది.

శిల్పాల్లో భవబంధాలు: ఆలయానికి చెందిన శిల్పాల్లో దృశ్యాలు కేవలం భక్తి, దేవతలతోనే కాకుండా, సామాజిక జీవితం, నృత్యాలు, శృంగార దృశ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇది ఒడిశా నాగర శిల్పశైలికి గొప్ప ఉదాహరణ.

కోణార్క్ నృత్యోత్సవం: ప్రతీవర్షం డిసెంబరు లేదా జనవరిలో ‘కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్’ నిర్వహించబడుతుంది. ఇందులో ఒడిశా నాట్యం (Odisha dance) సహా భారత దేశానికి చెందిన అనేక శాస్త్రీయ నృత్యరూపాలు ప్రదర్శించబడతాయి.

సూర్యోదయం వైపు నిర్మాణం: ఆలయం పూర్తిగా తూర్పుదిశగా, అంటే సూర్యోదయం వైపు ఉండేలా నిర్మించబడింది. ఉదయం తొలికిరణాలు (First rays) దేవుని విగ్రహంపై పడేలా శిల్పకళాకారులు రూపొందించారు.

జీవితంలో ఒక్కసారైనా కోణార్క్ ఆలయాన్ని సందర్శించాలి

కోణార్క్ దేవాలయం భారతీయ పురాతన నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మికతకు గొప్ప గుర్తింపు. ఇది కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు, అది కాలానికి లోనుకాని శిల్పకళా నికేతనం. ప్రతి భారతీయుడు కనీసం జీవితంలో ఒక్కసారైనా కోణార్క్ ఆలయాన్ని (Konark Temple) సందర్శించాలి. ఇది ఓ జ్ఞాపకం మన పురాతన సంస్కృతిని, శాస్త్రానుసారమైన నిర్మాణాన్ని, దేవతల పట్ల ఉన్న భక్తిని గుర్తు చేసే చిరస్థాయిగా నిలుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Day In Pics జూలై 03, 2025

#AncientArchitecture #culturalheritage #HeritageSite #HistoricalPlaces #IncredibleIndia #IndianTemples #KonarkFacts #KonarkSunTemple #OdishaTourism #SpiritualDestinations #SunTemple #TempleOfIndia #travelindia #UNESCOWorldHeritage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.