हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest Telugu News : Diabetes: ఆరోగ్య, శ్రామికశక్తిని హరిస్తున్న మధుమేహం!

Sudha
Latest Telugu News : Diabetes: ఆరోగ్య, శ్రామికశక్తిని హరిస్తున్న మధుమేహం!

మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజ ధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారా యని గణాంక వివరాలు తెలుపుతు న్నాయి. ఇప్పటికే మన దేశంలో 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరా ల మధ్య వయస్సుగల వారిలో11.5 మధుమేహ(Diabetes) బాధితులే. మధుమేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 101 మిలి యన్లకు చేరింది. ఇంకా గుర్తించ కుండా దేశంలో నిద్రాణంగా ఉన్న వారి సంఖ్య 38.6 మిలియ న్లని ఒక అంచనా. అంతేకాక అతి త్వరలో మధుమేహ (Diabetes) బాధితులలో చేరబోతున్న ‘ఫ్రీ డయాబెటిక్స్’ సంఖ్య ప్రతి వంద మందిలో 16 మంది ఉన్నారంటే మధుమేహ వ్యాప్తి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చును. పేద, ధనిక, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా నేడు దేశం లో మధుమేహం విజృంభిస్తోందడానికి నిదర్శనం పై సంఖ్యలే. మనదేశంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో మధుమేహ బాధితులున్నారు. గోవా, పుదుచ్చేరి రాష్ట్రాలలో ప్రతి వందమందిలో 26మంది ఉంటే, కేరళలో 25 మంది ఉన్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మనరెండు తెలుగు రాష్ట్రాలలో సరైన గణాంకాలు, సర్వేలు లేవు కానీ, గోవా, కేరళ రాష్ట్రాల్లో కంటే కాస్త ఎక్కువగానే మధుమేహ బాధితులున్నారని, ప్రతిరోజు ఆసుపత్రులను, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్న వారిని బట్టి తెలుస్తోంది. భారతదే శంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమే హం క్రమంగా వేగాన్ని పుంజుకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

Read Also : http://Kitchen Tips: రుచి, ఆరోగ్యం రెండింటికీ మేలు

Diabetes
Diabetes

మధుమేహం నియంత్రణ

ఈ నేపథ్యంలోనే మధు మేహం నియంత్రణ, నిరోధమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మధుమేహ కారక ఇన్సులిన్ ను, కనుగొన్న సర్ ఫెడరిక్ బ్యాంట్నిగ్ పుట్టినరోజైన నవంబర్ 14 వ తేదీని “ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అంతేకాక ప్రతి సంవత్సరం ఒక నినాదం కూడా ఇవ్వడం జరుగుతోంది . ఈ సంవత్స రం 2025కు మధుమేహం వెల్ బీయింగ్ లక్ష్యంగా వివిధ వయసులలో గల మధుమేహ బాధితులలో వ్యాయామాన్ని ప్రోత్సహించడం, ఆహార నియమాలను పాటించేలా చేయ డం, పోషకాహారం తీసుకోవడంలో సహకరించడం, ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడం, మానసిక ఒత్తిడి, ఆందోళనల ను తొలగించడం వంటి విషయాలలో చేయూత అందించి, మనలానే మధుమేహ బాధితులకు సైతం మెరుగైనజీవన పరిస్థితులకు సహకరించాలన్నది ఈ నినాదంముఖ్యఉద్దేశం. ఈ నినాద లక్షసాధనలో మనందరం భాగస్వాములు కావా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మనిషి జీవన విధా నం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మధుమే హం వంటి జీవితకాల దీర్ఘవ్యాధులకు ఆజ్యంపోస్తున్నాయి. కారణాలు ఏ వైనా అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో చోటు చేసుకున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ విని యోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, ఆందోళనలు,జన్యువులలో ఉత్పరివర్తనలు ఇలా ఎన్నో కారణాలు, రక్తములో షుగర్ ను నియంత్రించే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమగ్రంది)ను అసాధారణ రీతిలో ప్రభావితం చేయడం జరుగుతోంది. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ ఉత్ప త్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు( రెసిస్టెన్స్ ) శరీరకణాలు ఇన్సులిన్ని వినియోగించుకోలేకపోవ డం… వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో షుగర్ శాతాన్ని పెంచేస్తున్నాయి. ఈ అధిక స్థాయిలో రక్తంలో గల ఎగర్ అన్ని శరీర అవయవాలలో రక్తంతోపాటే చేరి, తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే షుగర్ను ‘వైట్ పాయిజన్’గా పేర్కొ నడం జరిగింది.

ఆహారపు అలవాట్లు

నేడు మనంఆహారం రుచిగా ఉండాలి, కంటికి ఇంపుగా ఉండాలి అనే చూస్తున్నాం కానీ, వాటిలో గల పోషక విలువల గురించి గానీ, ఆ రుచికి వాడుతున్న వివిధ రకాల రసాయనాలను గురించి గానీ, కంటికి ఇంపుగా కనిపించేందుకు వాడుతున్న రంగుల గురించి గానీ ఆలోచిం చటం లేదు. తగరపు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు పాలు, కాఫీ, టీ, కర్రీ, బిర్యాని వంటి వాటి ప్యాకింగ్ వాడుతున్నాం. ఆ వేడి పదార్థాలలో ప్లాస్టిక్ కరిగిపోయి ఆహారంలో కలుస్తుం దన్న విషయం గుర్తించడం లేదు. కాఫీ కప్పులు, గ్లాసులు కాగితాలతో చేసినా, వాటి లోపల ద్రవపదార్థాలను పీల్చ కుండా ఉండేందుకు రసాయనాలు పూత ఉంటుందన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఫంక్షన్లలో పింగాణీ కప్పులు, స్టీల్ గ్లాసులు వాడడం ఎప్పుడో పూర్తిగా మానేశాం. అంతే కాక మోదుగు, బాదం చెట్ల ఆకులతో చేసిన ప్లేట్లు లేదా విస్తరాకులు తగ్గిపోయి, పేపర్తో రసాయనాల పూతతో తయారుచేసిన అందమైన ప్లేట్లను వాడుతున్నాం. ఈ రసాయనాలన్నీ తేలికగా నీటిలో కరిగి, తినే ద్రవరూప, ఘన రూప పదార్థాలతో కలిసి జీర్ణాశయంలోకి పోతున్నాయి. చివరకు రక్తంలో చేరి ప్రతి అవయవానికి సరఫరా అవుతు న్నాయి. ఇవి శరీరంలోని అన్ని హార్మోన్లపై, అవయవాలపై ప్రభావం చూపుతున్నాయి. చివరకు గోళ్లు, వెంట్రుకలను కూడా వదలడం లేదు. శరీరం అంతా విషమయం అవు తుంది. అందులో ముఖ్యంగా అతి సున్నిత అవయవం అయిన ప్యాంక్రియాస్ పై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుం ది. అది సహజ సిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయకపోవడం, లేదా ఉత్పత్తి చేసిన శరీర కణజాలాలలో రెసిస్టెన్స్ వచ్చి వినియోగపడక పోవడం వల్ల చివరికి రక్తంలో షుగర్ స్థాయి అసాధారణ రీతిలో పెరిగిపోవడం జరుగుతోంది. అదే ఇప్పుడు మన వేధిస్తున్న సమస్య మధుమేహం.

Diabetes
Diabetes

ఆరోగ్యం విలువ

శరీరంలో శక్తిని జ్వలింప చేసే సహజ ఇన్సులిన్ కు అస్వస్థత చేస్తే, ఇన్సులిన్ పని చేయించుకోవడం లేదా ఎక్కువగా ఉత్పత్తి చేయడం కోసం ప్రతి రోజు శ్రమ పడక, మందులు వాడక తప్పని పరిస్థితు లు వచ్చేసాయి. ఒకసారి మధుమేహం వచ్చిందని నిర్ధారిం చాక ఇక జీవితాంతం దాని గురించి ఆలోచించక తప్పదు. ప్రతినెల రక్త పరీక్షలు, వైద్యుని సంప్రదింపులు, మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం, మళ్లీ రక్త పరీక్షలు, వైద్యులు, మందు లు, ఇలా ఒకవిష వలయంలో చిక్కుకుపోతున్నారు. మధు మేహ బాధితులు, వైద్యులు కాగితాలపై ప్రింట్ చేసి ఇచ్చే నియమాలు ప్రాక్టికల్గా పాటించటం అంత తేలిక కాదు. అలానే వ్యాయామంకు సమయం దొరకపోవడం, స్థలం దొరకపోవడం కూడా చాలామంది ఎదుర్కొనే సమస్య .ఇక రక్త పరీక్షలు, వైద్యుల సలహా, మందులు నేడు చాలా ఖరీదై పోతున్నాయి. ఇక కాంప్లికేషన్లు గురైన వారికి అయితేఇంకా ఖర్చు ఎక్కువవుతుంది. సంపాదనలో కొంత భాగం తప్పక మధుమేహ నియంత్రణకు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితులు వచ్చేసాయి. ఇంట్లో మధుమేహ బాధితులు ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఖర్చు మరింత పెరుగుతుంది. ఆనందంగా ఏ ఆహా రం తీసుకోలేరు. రుచిగా ఉందని ఏ ఆహారం ముట్టుకున్న లోపల ఉన్న మధుమేహం భయపెడుతూనే ఉంటుంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. మధుమేహ బాధితులు తమ శత్రువులకు కూడా ఈ కష్టాలు రాకూడదని అనుకుంటారు. కానీ వీరు సుగర్ రాకముందు జాగ్రత్తలలో ఎంతో అజాగ్రత్తగా ఉంటారు. మధుమేహం బారిన పడ్డాకే చాలామందిలో ఆరోగ్యం విలువ తెలుస్తుంది. నిజానికి ఎంతకాలం బతికామన్నది ముఖ్యంకాదు. ఆరోగ్యం గా ఎంతకాలం బతికామన్నదే ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు, మధుమేహం వంటి జీవితకాల వ్యాధుల బారిన పడకుండా ఉండేం దుకు కొంత సమయం కేటాయించాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా నేడు మధుమేహం ఒక పెద్ద ప్రజా రోగ్యసమస్య అయి కూర్చుంది. దేశ శ్రామిక శక్తిపై అత్యంత ప్రభావం చూపుతోంది. అంతేగాక దేశాన్ని ఆర్థిక పరంగా, బాధితుల కుటుంబాలను ఆరోగ్య, ఆర్థికపరంగా కృంగదీస్తోంది. దేశ ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధుమేహ నిరోధక చర్యలపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు అత్యవసరమయ్యాయి. ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. ఎ
– డాక్టర్ టి. సేవకుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870