జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర–2026 (Medaram 2026) పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క- సారక్కలను స్మరించుకుంటూ, మేడారం మహా జాతరను కేవలం ఒక మతపరమైన ఉత్సవంగా కాకుండా తెలంగాణ సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు.
Read Also: HYD Crime: హైడ్రా కమిషనర్ రంగనాథ్, గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం?
అతిపెద్ద జాతర
మేడారం మహా జాతర 2026 (Medaram 2026) జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ భారీ జనసందోహానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: