📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Revanth Reddy: నేడు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర..బోనం సమర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఆషాడమాసం బోనాల సందడి ఊపందుకుంది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ సికింద్రాబాద్‌లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది.ఈ రెండు రోజుల పాటు సాగనున్న మహోత్సవానికి భారీ భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజలకు సౌకర్యాలన్నీ కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.2500మందికి పైగా పోలీసులను బందోబస్తు కోసం నియమించారు.ట్రాఫిక్‌ మళ్లింపు, మెడికల్ హెల్ప్‌డెస్కులు, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక పద్ధతులు అమలులోకి వచ్చాయి.ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బోనం సమర్పించనున్నారు.అనంతరం ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి హాజరుతో జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. బోనాల సందర్భంగా ఈరోజు, రేపు హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌ పెట్టారు. అలాగే, పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

బోనాల వేడుక

బోనాలు తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాలలో ప్రత్యేకస్థానం పొందిన పండుగ. మహిళలు పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.డప్పు చప్పుళ్లు,పోతురాజులు,ఘటాల ఊరేగింపులుఈ పండుగ ప్రత్యేక ఆకర్షణలు.ఇవి లష్కర్ బోనాలు లేదా ఉజ్జయిని బోనాలు అనే పేర్లతో సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి. గోల్కొండ కోట (Golconda Fort) లో బోనాలు ప్రారంభమై, లాల్‌ దర్వాజతో ముగుస్తాయి. నెల రోజుల పాటు, హైదరాబాద్‌ అంతటా బోనాల వేడుక వైభవంగా జరుగుతుంది. ఆషాడ మాస బోనాల్లో గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించే సంప్రదాయం కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇవాళ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.

CM Revanth Reddy

అమ్మవారి ఆలయాల్లోనూ

బోనాల ఉత్సవాలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు.జులై 20 ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. రెండుచోట్ల రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో మట్టికుండపై భవిష్యవాణి వినిపిస్తారు. జులై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండలో నెల రోజులపాటు ప్రతి గురువారం, ఆదివారం బోనాల సందడి ఉంటుంది. మొత్తం 9 పూజ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సిటీలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ బోనాలు (Bonalu) నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది దేవాదాయశాఖ. జంటనగరాల్లో బోనాల కోసం 20కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

బోనాలు అంటే ఏమిటి?

బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకునే ఒక పారంపర్య హిందూ పండుగ. ఈ పండుగను మహాకాళి దేవికి అర్పణగా నిర్వహిస్తారు.

బోనాల పండుగ ప్రాముఖ్యత ఏమిటి?

బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో జరుపుకునే ఒక ప్రాముఖ్యమైన హిందూ పండుగ. ఈ పండుగను మహాకాళీ అమ్మవారికి అంకితంగా జరుపుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rain Alert: తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

Breaking News CM Revanth Reddy Bonam Mahankali Jatara Hyderabad Secunderabad Bonalu Festival Telangana Aashada Bonalu Telugu News Ujjaini Bonalu 2024

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.