📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

FSSAI Lab Tirumala Inauguration: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన: FSSAI ల్యాబ్ ప్రారంభం

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

FSSAI Lab Tirumala Inauguration: తిరుమల శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తిరుమలలో అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన FSSAI (భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ) ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Read Also: AP Liquor Scam: అవినాశ్ రెడ్డికి బెయిలు మంజూరు

తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ నిర్మించారు. తిరుమలలో భక్తులకు లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలను మరింత నాణ్యతగా, రుచిగా అందించేందుకు.. నీరు, ముడిసరుకులు, ఇతర పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

cm-chandrababu-naidu-inaugurates-fssai-lab-tirumala-laddu-quality-check

ముడిసరుకుల్ని పరీక్షించేలా

ఏపీ ప్రభుత్వం 2024 అక్టోబరు 8న ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)తో ఒప్పందం చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమలలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో ప్రధానంగా ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల్ని పరీక్షించేలా ల్యాబ్ ప్లాన్ చేశారు. దేశంలోనే తొలిసారి ఒక ఆలయంలో ల్యాబ్‌ ఏర్పాటు చేసిన ఘనత దక్కింది.ఈ ల్యాబ్‌లో అత్యాధునిక పరికరకాలు ఉన్నాయి. ఈ ల్యాబ్‌లో యాంటీ బయోటిక్స్‌, పురుగు మందుల అవశేషాలు, లెడ్‌ ఆర్సెనిక్‌ వంటి వాటిని గుర్తించే పరికరాలు ఉన్నాయి.

ఈ ల్యాబ్‌కు త్వరలోనే ఫ్రాన్స్ నుంచి రూ.3 కోట్ల విలువైన ఈ-నోస్‌, ఈ-టంగ్‌ పరికరాలు కూడా రాబోతున్నాయి. తిరుమలలో అందించే జలప్రసాదం శాంపిల్స్ కూడా ఈ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. అంతకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. తిరుమలలో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Govt Initiatives Tirumala CM Chandrababu Naidu Tirumala Visit 2026 FSSAI Lab Tirumala Inauguration Tirumala Laddu Quality Testing Lab TTD Food Safety Standards News Water and Food Analysis Lab TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.