Char Dham Yatra 2026: చార్‌ధామ్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి తెరచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ అధికారికంగా తేదీలను ప్రకటించింది.
Read Also: Andhra Pradesh: కన్నుల పండుగగా శ్రీశైల మల్లన్న రథోత్సవం
పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడటంతో ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్‌లో మూసివేస్తారు. వాతావరణం అనుకూలించిన తర్వాత ఆరు నెలల విరామం అనంతరం ఏప్రిల్‌లో తిరిగి భక్తుల కోసం తెరచుకుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19 నుంచి దర్శనానికి అందుబాటులోకి రానున్నాయి.
భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీలు యాత్ర ఏర్పాట్లను వేగవంతం చేశాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, వసతి కేంద్రాలు, వైద్య సదుపాయాల మరమ్మతులు, భద్రతా ఏర్పాట్ల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. లక్షలాది యాత్రికులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి రావల్ భీమశంకర్ లింగ్, ఎమ్మెల్యే ఆశా నౌటియాల్, ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది సహా పలువురు అధికారులు, మత పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: