Dadi Ratan Mohini : బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌

Read Time:  1 min
Brahma Kumaris Chief Dadi Ratan Mohini passed away
Brahma Kumaris Chief Dadi Ratan Mohini passed away
FONT SIZE
GET APP

Dadi Ratan Mohini : శ‌తాధిక వృద్ధ మ‌హిళ‌, ఆధ్యాత్మిక నేత, బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ దాది ర‌త‌న్‌ మోహిని క‌న్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్ర‌హ్మ‌కుమారిగా ర‌త‌న్ మోహిని రికార్డు నెల‌కొల్పారు. అంత‌కుముందు దాది జాన‌కి.. బ్ర‌హ్మ‌కుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జాన‌కి 1916, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన జ‌న్మించి, 2020, మార్చి 27వ తేదీన మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజుల నుంచి దాది ర‌త‌న్ మోహిన్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది.

బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్

శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాం తరలింపు

దీంతో రాజ‌స్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివ‌నంలోని ట్రామా సెంట‌ర్‌కు డ‌యాల‌సిస్ కోసం ఆమెను త‌ర‌లించారు. సోమ‌వారం ఆమె ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంగా మారింది. దీంతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న ఆమెను అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1.20 నిమిషాల‌కు ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్ర‌హ్మ‌కుమారి ప్ర‌ధాన కార్యాల‌యంలో శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాన్ని తీసుకెళ్ల‌నున్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో సేవా కార్య‌క్ర‌మాలు

సింధ్‌లోని హైద‌రాబాద్‌లో 1925, మార్చి 25వ తేదీన దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ. చాలా ఉన్న‌త‌మైన కుటుంబంలో ఆమె జ‌న్మించారు. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్ర‌హ్మ‌కుమారి ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫ‌రెన్స్‌లో బ్ర‌హ్మ‌కుమారీల త‌ర‌పున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె ప‌ర్య‌టించారు.

Read Also: చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.