📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: BR Naidu: జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : వైఖానస ఆగమోక్తంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలను సామాన్యభక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి చైర్మన్ బిఆరా నాయుడు(BR Naidu) వెల్లడించారు. పదిరోజుల దర్శనాల్లో మొదటి మూడురోజులు (డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1) మినహా మిగిలిన ఏడురోజులు టోకన్లు, టిక్కెట్లు లేకున్నా దర్శనాలకు రావచ్చని సామాన్యభక్తులకు పిలుపునిచ్చారు. ఏడురోజులు ఆ వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Read Also: Tirumala: వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8

బుధవారం ఉదయం తిరుమలలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్ ఒ నీలిమతో కలసి ఛైర్మన్ నాయుడు మీడియాప్రతినిధులతో మాట్లాడారు. డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8 వరకు ఎంతో గొప్ప కార్యక్రమం జరుగనుందన్నారు. మొదటి మూడురోజులూ ఆన్లైన్ ద్వారా టోక్లను బుక్చేసుకున్న వారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. 182 గంటల్లో 164గంటలు సామాన్యభక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

Sarva Darshan without a ticket from January 2 to 8

10గంటలకు శ్రీవాణి టిక్కెట్ కోటా

జనవరి 2నుండి 8వరకు ఎస్ఇ డి రోజుకు 15వేల టిక్కెట్లు, శ్రీవాణి రోజుకు వెయ్యిటిక్కెట్లు ఆన్లైన్లో జారీచేస్తామన్నారు. డిసెంబర్ 5వతేదీ ఉదయం 10గంటలకు శ్రీవాణి టిక్కెట్ కోటా, మధ్యాహ్నం 3గంటలకు ఎస్ డి 300 రూపాయలు దర్శన కోటా విడుదలచేస్తామన్నారు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు జనవరి 6,7,8 తేదీలకు రోజుకు ఐదువేల టోకన్లు ఆన్లైన్లో జారీచేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 10వతేదీ స్థానికుల దర్శన కోటా విడుదలవుతుందన్నారు.

భక్తులు టిటిడి(TTD) సూచనలు పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని బిఆర్నాయుడు విజప్తి చేశారు. వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి మొదటిమూడురోజులు డిసెంబర్ 30,31, 2026 జనవరి 1వతేదీ దర్శన టోకెన్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్(Electronic Dip) ద్వారానే టిటిడి టోకెన్లు జారీచేస్తుంది. నేటి నుండి ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 1వతేదీ వరకు అవకాశం కల్పించింది. జనవరి 2వతేదీ నుండి 8వరకు పూర్తిగా ఎలాంటి టోకెన్లు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Temples BR Naidu Devotees update Sarva Darshan Ticketless darshan Tirumala News TTD Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.