భక్తి శ్రద్ధలతో
హైదరాబాద్ : రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, వేలాది మంది భక్తులు అమ్మ వారికి పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీర్వచనాల కోసం బోనాలు (Bonalu) సమర్పించారు. అమ్మ వారికి భక్తి శ్రద్దలతో నైవేద్యం పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారి దర్శన కోసం వేలాది మంది భక్తులు తరలి రావటంతో మందిరం పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి. సింహవాహిని మహంకాళి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్ర మంత్రులు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, టిపిసిసి అధ్యక్షులు ఎం.మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఎంపిలు డి.కె. అరుణ, చామ కిరణ్కుమార్రెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, మాజీ ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాజాకూర్, బిజెపి నాయకులు వీరేందర్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు లాల్దదర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారికి పూజలు నిర్వహించారు.
అత్యంత వైభవంగా
బోనాలు సందర్బంగా పాతబస్తీలో దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.హైదరాబాద్ పాతబస్తీలో చారిత్రాత్మక లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోతరాజుల నృత్యాలు,పలు రకాల వేష ధారణాలు, డప్పుల చప్పుళ్లతో లాల్ దర్వాజ ఆలయం (Lal Darwaza Temple) ప్రాంగణం శోభా యమానంగా కనిపిం చింది. ఉత్సవాలను తిలకించటానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ అన్నిఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వం తరుపున లాల్ దర్వాజచేశారు.
నేడు రంగం
లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మ వారి బోనాల ఉత్సవాల రెండవ రోజైన 21వ తేదీ సోమవారం రంగం జరగనున్నది. అమ్మ వారి భక్తురాలు భవిష్యవాణి వినిపించనున్నారు. అనంతరం అమ్మ వారిఘటం ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది.
హైదరాబాద్‌లో మొదటి బోనాలు ఎక్కడ జరుపుతారు?
హైదరాబాద్‌లో మొదటి బోనాలు సంప్రదాయంగా గోల్కొండ కోటలో నిర్వహించబడతాయి. ఇది ఆశాడ మాసం సందర్భంగా ప్రారంభమయ్యే బోనాల పండుగకు శ్రీకారం చుడుతుంది. ఈ సందర్భంగా భక్తులు నగరాన్ని రక్షించే దైవంగా భావించే మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు.
గోల్కొండ బోనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
గోల్కొండ బోనాలు 1813లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. అదే సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది ప్రజలు మరణించారు. అప్పట్లో ప్రజలు మహాకాళి దేవికి మొక్కుకుని, ఆమెను శరణు వెళ్లి పూజలు చేసి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచే బోనాల పండుగ ఏటా గోల్కొడాలో మొదలయ్యే సంప్రదాయం ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో అటవీ, పోలీసు సిబ్బందిపై పోడు రైతుల దాడి