📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Bihar : చకియాకు చేరుకోనున్న అతిపెద్ద శివలింగం

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు(Tamilnadu)లోని మహాబలిపురంలో చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరానికి(Bihar) తరలిస్తున్నారు. నవంబర్ 21న పూజల అనంతరం ఈ లింగం ప్రయాణం ప్రారంభమైంది. 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువున్న ఈ శివలింగాన్ని 96 చక్రాల ప్రత్యేక హైడ్రాలిక్ వాహనంపై 20–25 రోజుల్లో గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు.

Read also : Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ…

The largest Shivalinga to reach Chakia

దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయం

దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ మందిరం 1,080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో నిర్మాణంలో ఉంది. 22 మండపాలు, 18 గోపురాలు, 270 అడుగుల ప్రధాన గోపురం దీనిలో భాగం. ఇప్పటికే ప్రధాన ద్వారం, వినాయక ఆలయం, నంది విగ్రహం వంటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. శివలింగ ప్రతిష్ఠ(Shivlinga Prathista) అనంతరం మిగిలిన పనులు వేగవంతం కానున్నాయి.

మహాబలిపురం నుంచి చకియా(chakiya) వరకు లింగం ప్రయాణంలో భక్తుల స్వాగతం కోసం పలు ప్రదేశాల్లో వేదికలు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కారణాల కోసం ట్రాఫిక్ మార్గాలు మార్చి, ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రతికిలోమీటరు సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయి.

చకియాకు చేరిన తర్వాత, ప్రత్యేక శుభ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరగనుండగా దేశం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పాల్గొననున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Bihar temple giant monolithic lingam Hindu temple news Mahabalipuram Shiva Lingam Temple Construction Virat Ramayan Mandir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.