భోగి పండుగ(Bhogi Festival) రోజున కొన్ని సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతారు. ఎనిమిదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు సూర్యాస్తమయం ముందే భోగి పళ్లు పోయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదయం వేళల్లో ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే సంప్రదాయం ఉన్న కుటుంబాల్లో మధ్యాహ్న సమయంలో బొమ్మల కొలువును కూడా నిర్వహిస్తారు.
Read Also: Bhogi Festival: మంటలు వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?
భోగి రోజున(Bhogi Festival) చేసే భోజనంలో నువ్వులతో చేసిన సజ్జ రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని, సంప్రదాయంగా కూడా ముఖ్యమని భావిస్తారు. ధర్మప్రవృత్తి గ్రంథం ప్రకారం, ఈ రోజున గుమ్మడికాయను దానం చేస్తే, గత జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పేర్కొనబడింది. అందుకే భోగి పండుగను ఆధ్యాత్మికత, సంప్రదాయం, కుటుంబ ఐక్యతను ప్రతిబింబించే పర్వదినంగా జరుపుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: