📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Batukamma Festival – తెలంగాణ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

Author Icon By Anusha
Updated: September 20, 2025 • 7:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూలతో అలంకరించిన గోపురాల్లాంటి బతుకమ్మల చుట్టూ సాగే గీతాలు, నృత్యాలు కేవలం వినోదం కాదు, ప్రకృతి పట్ల గౌరవం, సమాజ పట్ల ఐక్యతను ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై

ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, మహిళల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ (Batukamma Festival) తెలంగాణ ప్రజల ఐక్యతకు, కష్టసుఖాలను కలిసి పంచుకునే వారి సామూహిక జీవన విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Batukamma Festival

రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఈ పూల పండుగను సంతోషంగా, కలిసికట్టుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/jishnu-dev-verma-students-should-serve-farmers/telangana/551094/

bathukamma festival Bathukamma Greetings Breaking News latest news Revanth Reddy Telangana Chief Minister Telangana Culture Telangana traditions Telangana Women Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.