ప్రపంచ రికార్డు సృష్టించేలా సంబురాలు జరుపుతాం: తెలంగాణ మంత్రులు జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ : గిన్నిస్ బుక్ రికార్డు (Guinness Book of Records) లో చేరేలా బతుకమ్మ సంబరాలు జరుపుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంసృతి అని బతుకమ్మ అంటే ప్రకృతి గౌరవించడం, ప్రకృతిని కాపాడటమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తెలంగాణ సంసృతి (Telangana culture) ప్రపంచానికి చాటి చెప్పాలి మంత్రి పిలుపునిచ్చారు. 21నుండి31 వరకు బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుతామని వివరించారు. 21 న వెయ్యి సంభాల వద్ద ప్రారంభం చేయబోతున్నామని అన్నారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ పూల పండుగ మాత్రమే కాదు ఆడబిడ్డలను గౌరవించుకునే పండుగ అని తెలిపారు.
సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందని
బతుకమ్మ (Bathukamma) తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందని తెలిపారు. కవులను రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలకు ట్యూన్స్ కట్టించడంతోపాటు, ఆ పాటలను ముందు తరాలకు అందించేలా ముద్రణ చేయిస్తామని తెలిపారు.
బతుకమ్మ జరిగే ప్రాంతంలో డెకరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు విమానాశ్రయంలో కూడా మన సంసృతి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి అని కోరుతున్నాను. వివిధ రుగ్మతలు పారదోలే విధంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.
బతుకమ్మ కుంటలో ఆడకుండా చేశారు
బతుకమ్మ పండుగ ఉద్దేశం అందరూ కలిసి ఆత్మీయత కోసం ఇది వ్యక్తుల కార్యక్రమం కాదు అందరి పండుగ అని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ హనుమంతరావు (Former MP Hanumantha Rao) మాట్లాడుతూ 30 ఏళ్లుగా బతుకమ్మ కుంటలో ఆడకుండా చేశారు గత ప్రభుత్వం హయంలో ఎంతోమందిని అడిగినా పట్టించుకోలేదని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కబ్జా చేశాడు కాంగ్రెస్ అధికారంలో రాగానే బతుకమ్మ కుంట చాలా బాగా చేసారు నేను సోనియా గాంధీకి ఇది మా సంసృతి అని కూడ బతుకమ్మ అని చెప్తే ఆమె కూడ బతుకమ్మ ఎత్తుకుందని గుర్తుచేసుకొన్నారు. బతుకమ్మ కుంటను కాపాడిన రేవంత్ రెడ్డికి, హైడ్రాకు నా అభినందనలు అని అన్నారు.
చాలా వరకు 2000 నుండి బతుకమ్మ ఏర్పాటు అయింది
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ కాంగ్రెస్ శ్రేణులు ఎంగిలి పువ్వు నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరారు. చాలా వరకు 2000 నుండి బతుకమ్మ ఏర్పాటు అయింది అపోహ ఉందని కానీ ఇది పాత పండుగనే అని ఆయన తెలిపారు.
కొందరు బతుకమ్మను రాజకీయం చేశారని అన్నారు. రకరకాల పాటలతో బతుకమ్మను ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు. ఇది తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టేపండుగ అని ఆయన అన్నారు. తెలంగాణ సంప్రదాయం, బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా జరుపుకోవాలి. బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్ళీ వచ్చింది. బతుకమ్మ కుంటను కాపాడటంలో రేవంత్ రెడ్డి, హనుమంతు రావు పాత్ర కీలకమని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: