📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Bathukamma Festival 2025- బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం.. రోజు వారీ బతుకమ్మ వివరాలు

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. “రామ రామ ఉయ్యాలో… రామనే శ్రీరామ ఉయ్యాలో…” అంటూ చిన్నా–పెద్దా తేడా లేకుండా స్త్రీలు, పిల్లలు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, సంతోషంగా ఆడుతూ పాడుతూ వేడుకలు నిర్వహిస్తారు.

పచ్చని ప్రకృతి నుంచి వచ్చే రంగు రంగుల పూలతో గౌరమ్మను అలంకరించి, ప్రతిరోజూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ పూజించడం ఈ పండుగ ప్రధాన ఆకర్షణ. బతుకమ్మ అంటే కేవలం పువ్వులు పేర్చిన గోపురం మాత్రమే కాదు, అది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, భక్తి, ఆనందాల సమ్మేళనం.సెప్టెంబర్ 21 ఎంగిలి పూల బతుకమ్మతో బతుమ్మ పండుగ వేడుకలు మొదులు అవుతాయి.

ఎంగిపూల బతుకమ్మ

ఈరోజున ఆడబిడ్డలందరూ రంగు రంగుల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి, ఎంగిపూల బతుకమ్మతో ఈ పండుగ సెలబ్రేషన్స్ స్టార్ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ ఆటను ఆడుతారు.కాగా, పువ్వులను పూజించే ఈ బతుకమ్మ పండుగను ఏ రోజు ఏ బతుకమ్మను పేరుస్తారు. ఏ పేరుతో పిలుస్తారు. అంతే కాకుండా ఏ నైవేద్యం సమర్పిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి.

అటుకుల బతకమ్మ

పెత్తరామాస రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. భాద్రపద అమావాస్య రోజున పేర్చే ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలు అవుతుంది. ఈ రోజు అమ్మవారికి తులసి ఆకులు, వక్కలు నైవేద్యం సమర్పిస్తారు, రెండో రోజు అటుకుల బతకమ్మ, ఈ అమ్మ వారికి చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. విదియనాడు ఈ బతుకమ్మను పేరుస్తారు, ఈరోజు అమ్మవారికి ముద్దపప్పు, బెల్లం సమర్పిస్తారు, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, నానేసిన బియ్యంతో పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్ల బతుకమ్మ ఈరోజు అట్లు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఈరోజు అమ్మవారు అలిగారు అని బతుకమ్మ ఆడరు. అంతే కాకుండా ఈరోజును అర్రెం అని కూడా పిలుస్తారు.ఎడో రోజు వేపకాయల బతుకమ్మ, ఈ రోజు అమ్మవారికి వేపకాలు నూనెలో వేయించి నైవేద్యం పెడతారు.

వెన్నెముద్దల బతుకమ్మ

Bathukamma Festival 2025

ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ . ఈ రోజున అమ్మ వారికి వెన్నెను ప్రసాదంగా పెడతారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ, ఈరోజు సత్తు పిండి, పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. ఈరోజుతో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ముగుస్తాయి. ఈ పండుగనే పెద్ద బతుకమ్మ అంటారు. ఈ రోజు ప్రతి పల్లె పట్నంలో మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతూ.. పండుగను జరుపుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bandaru-dattatreya-invites-actor-nagarjuna-to-alai-balay/telangana/551506/

bathukamma celebrations Bathukamma dates 2025 Bathukamma day wise list Bathukamma festival 2025 Breaking News latest news Telangana Bathukamma festival Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.