తిరుమలలో కేంద్రమంత్రి బండి సంజయ్
తిరుమల : హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేని, అన్యమత ఉద్యోగులను తక్షణం తోలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. టిటిడి పాలకమండలి వెంటనే వారందరినీ బయటకు సాగనంపాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉద్యోగిని తొలగించడంపై స్పందించిన ఆయన ఒకరిని తొలగిస్తే సరిపోదని, అన్యమత ఉద్యోగంలందరినీ గుర్తించి వెంటనే తోలగించాలని టిటిడికి అల్టిమేటమ్ ఇచ్చారు. టిటిడిలో ఉన్న అన్యమతస్థులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
హిందువులు అందరిదీ
శ్రీవారి సేవలో నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసే వారికి అవకాశం కల్పించాలని సూచించారు. అన్ని మతాల వారిని ఆదరించడానికి టిటిడి సత్రం కాదని కేంద్రమంత్రి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిటిడి (TTD) ఏ ఒక్కరి ఆస్తి కాదని, హిందువులు అందరిదీ అని అన్నారు. సనాతన ధర్మంకోసం అందరూ ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. తెలుగురాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోబాటు పురాతన ఆలయాలను టిటిడి అభివృద్ధిచేయాలని ఆయన కోరారు.
కేంద్రమంత్రి హోదాలో
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, వేములవాడ ఆలయాల అభివృద్ధికి టిటిడి సహకారం అందించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి హోదాలో పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు. పుట్టినరోజున శ్రీవారి దర్శనంతో మనసు సంతోషం వ్యక్తం చేశారు. రంగనాయకుల మండపం (Ranganayakula Mandapam) లో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్రమంత్రి వెంట టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, డిప్యూటీ ఇఒ భాస్కర్ ఉన్నారు.
బండి సంజయ్ కుమార్ ఎవరు?
బండి సంజయ్ కుమార్, భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన కేంద్ర హోం వ్యవహారాల శాఖలో సహాయ మంత్రిగా (Minister of State for Home Affairs) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే, 2019 నుండి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుండి ప్రారంభమైంది?
బండి సంజయ్ BJYM (భారతీయ జనతా యువమోర్చా) ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి గెలిచి ఎంపీగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: Jishnu Dev Varma: భూతాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహం – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ