📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Anam Ramanarayana Reddy: టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారు

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉద్యోగులుగా నియమించారని

టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమే అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంగీకరించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీలో హిందూయేతర ఉద్యోగులు ఉన్నారనేది నిజమేనని ఆయన తెలిపారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలన విభాగాల్లో హిందువు (Hindus) లు కాని వారిని ఉద్యోగులుగా నియమించారని ఆయన చెప్పారు.ఎంతమంది ఉన్నారనే దానిపై నివేదిక కోరామని, ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. దేవదాయ శాఖకు టీటీడీ నుంచి ఎంత సీజీఎఫ్ రావాలనే దానిపై కూడా చర్చించామని,

ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను పరిశీలించి

ఈ అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.టీటీడీలో వెయ్యిమందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని వారికి సనాతన ధర్మంపై విశ్వాసం లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రెండు రోజుల కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆనం స్పందిస్తూ, టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారని, అయితే వారు ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను పరిశీలించి, న్యాయపరమైన సమస్యలు ఏమైనా తలెత్తుతాయా అని తెలుసుకున్న తర్వాత వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు.

Anam Ramanarayana Reddy: టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారు

నిర్ణయం తీసుకుంటామని

టీటీడీ నుంచి దేవదాయ శాఖకు ఎంత సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) రావాలనే అంశంపై కూడా మంత్రి ఆనం ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ వేదపండితులకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే అంశంపై కూడా చర్చించారు.విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 2.10 ఎకరాల భూమిని అమ్మవారి ఆలయానికి లీజుకు ఇవ్వాలని కోరగా, టీటీడీ (TTD) సానుకూలంగా స్పందించింది.ఈ స్థలం అందుబాటులోకి వస్తే కార్ పార్కింగ్, వసతి సముదాయాలు, కొత్త రోడ్డును నిర్మించవచ్చు.

ఆదాయం

దీనివల్ల భక్తులు ఒక మార్గంలో పైకి వెళ్లి, మరో మార్గంలో కిందకు వచ్చే అవకాశం ఉంటుంది.దేవదాయ శాఖ పరిధిలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్న 1,014 ఆలయాలకు ఆగస్టులో కొత్త పాలకవర్గాలను నియమిస్తామని మంత్రి తెలిపారు. అలాగే, రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం ఉన్న 500 ఆలయాలకు రెండు, మూడు నెలల్లో పాలకవర్గాలను నియమిస్తామని ఆయన చెప్పారు.శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆలయాల నిర్మాణాలకు రూ.147 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఖర్చుల వివరాలు అందిన వెంటనే నిధులు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయా?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఏడు కొండల ఉంటాడు. ఈ ఏడు కొండలు శేషాచలం పర్వత శ్రేణిలో భాగంగా ఉండే తూర్పు కనుమలలో ఉన్నాయి.శేషాద్రి (Seshadri),నీలాద్రి (Neeladri),గరుడాద్రి (Garudadri),అంజనాద్రి (Anjanadri),వృషభాద్రి (Vrushabhadri),నారాయణాద్రి (Narayanadri),వేంకటాద్రి (Venkatadri).

తిరుమల అసలు పేరు ఏమిటి?

తిరుమలకు అసలు మరియు ప్రాచీనంగా పిలిచే పేరు “శేషాద్రి” లేదా “శేషాచలం”. ఇది శేషపర్వత శ్రేణిలో భాగం. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు విభిన్న పేర్లతో పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

Anam Ramanarayana Reddy Andhra Pradesh Government Breaking News Hinduism non-Hindu employees Telugu News temple administration Tirumala temple TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.