📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Ambajipeta: జగ్గన్నతోటలో ప్రభల హోరు… ఏకాదశ రుద్రుల మహోత్సవం వైభవం

Author Icon By Pooja
Updated: January 17, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోనసీమ వ్యాప్తంగా 170 గ్రామాల్లో ప్రభల మహోత్సవం

అమలాపురం/అంబాజీపేట : పచ్చటి తివాసి పరిచినట్లు వరిచేలు, ఒంపులు తిరిగి గలగలా పారే కౌశికనదీ పాయతో పాటు పిల్ల కాలువలు, వేపుగా పెరిగిన కొబ్బరి చెట్లు నడుమ ఎటు చూసినా జన సందోహం. ఏ రహదారి చూసిన తీర్థం వైపే పయనం. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువైన ప్రదేశాన్ని భక్తి పూర్వకంగా తిలకించేందుకు ఆరాటం. గల గల పారే కౌశిక నదీ పాయలో పీకల్లోతు నీటిలో తేలియాడుతూ గంగలకుర్రు అగ్రహారం రుద్ర ప్రభలను మోసుకొస్తున్న దృశ్యాలను చూడాలనే ఆత్రుత. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట(Ambajipeta) మండలం మొసలపల్లి పం చాయతీ పరిధిలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభల మహోత్సవం, తీర్థమును వీక్షించడం అదృ ష్టంగా భావిస్తారు.

Read Also: Medaram Prasadam : ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

భగవద్గానుగ్రహం లేకపోతే ఒకే చోట కొలువై ఉండే ఏకాదశరుద్రులను దర్శించుకోవడం అసాధ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాతన చరిత్రతో పాటు ఇటీవల జాతీయస్థాయి గుర్తింపు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర పండుగ్గ’గా గుర్తించడంతో జగ్గన్నతోట ఏకాదశరుద్రులు ప్రభల మహోత్సవం, తీర్థంను ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సంక్రాంతి పర్వదినాలను పురష్కరించుకుని కనుమనాడు నిర్వహించిన జగ్గన్నతోట, సాకుర్రు గున్నేపల్లి సెంటర్, చిరతపూడి డాము సెంటర్లో శుక్రవారం జరిగిన ప్రభల తీర్థాలు అత్యంత వైభవంగా జరిగాయి.

అంబాజీపేట మండలంలోని మొసలపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గన్నతోటలో నిర్వహించిన ప్రభల తీర్థ మహోత్సవం అత్యంతప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మూడేళ్ల క్రితం ప్రదర్శించిన ఏపీ రాష్ట్ర సకటాలలో ఏకాదశ రుద్రుల ప్రభను ప్రదర్శించడంతో జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలో నలుమూలలలో ఉన్న స్థానిక తెలుగువారు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కనుమనాడు ఒకే చోట కొలువయ్యే ఏకాదశ రుద్రులను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు తరలివచ్చారు.

వ్యాప్తంగా 170 గ్రామాల్లో వందలాది రుద్ర ప్రభలు

కోనసీమ(Ambajipeta) కొలువు తీరగా తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏకాదశ రుద్రులను దర్శించుకున్న వారిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వి, రాష్ట్ర అటవీ శాఖ ఐటీ సలహాదారుడు పెన్నమరెడ్డి నాగబాబు, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు శిరిగినీడి వెంకటేశ్వరరావ , మట్టపర్తి బాలభారతి, బొంతు పెదబాబు, ఎంపీటీసీ నూకపేయి సత్యనారాయణ, నాయకులు దాసరి వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి బూడిద వరలక్ష్మి, దంతులూరి శీనురాజు, గూడాల ఫణి, అరిగెల సూరిబాబు, దొమ్మేటి సాయికృష్ణ, మైపాల తాతాజీ కొర్లపాటి గోపి,జల్లి బాలరాజు, సుంకర గణపతిరావు, అక్కిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జగ్గన్నతోటలో కొలువుదీరిన ఏకాదశరుద్రులు వీరే:

మొసలపల్లి మధుమాసంత భోగేశ్వర స్వామి,
ఇరుసుమండఆనంద రామేశ్వరస్వామి, ముక్కామలరాఘవేశ్వరస్వామి, వక్కలంకకాశీ విశ్వేశ్వర స్వామి, వ్యాఘేశ్వరంవ్యాఘేశ్వర స్వామి, పుల్లేటికుర్రుఅభినవ వ్యాఘేశ్వరస్వామి, కె. పెదపూడిమేనకేశ్వ రస్వామి, గంగలకుర్రుచెన్న మల్లేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారంవీరేశ్వరస్వామి, పాలగుమ్మిచెన్నమ ల్లేశ్వరస్వామి, నేదునూరుచెన్నమల్లేశ్వర స్వామి వార్లు కొలువుదీరారు. జిల్లాలోని అత్యంత ఎత్తు, బరువైన ప్రభలు: ప్రభల తీర్థ మహోత్సవాల్లో ముఖ్యంగా తొండవరం శ్రీ ఉమాతొండేశ్వర స్వామి (56 అడుగులు ఎత్తు), వాకలగరువు శ్రీ ఉమా పార్వతీ సోమేశ్వర స్వామి (54 అడుగులు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యంత ఎత్తైన, బరువైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

EkadashaRudralu Google News in Telugu Latest News in Telugu PrabhalaMahotsavam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.