శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించిన మెస్త్రం వంశీయులు
ఆదిలాబాద్ జిల్లా(Adilabad) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర, పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి, కొత్త కుండల్లో వండిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి జాతరను అధికారికంగా ప్రారంభించారు.
Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
జాతరను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపి, ఎమ్మెల్యేలు
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోబా జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. మెస్రం వంశీయులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించడం వారి అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతరను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిరిజన గూడాల్లోని ప్రతి కుటుంబంపై నాగోబా దేవత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నాగోబా జాతర(Nagoba Jatara) కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ నెల 22న జరగనున్న దర్బార్డ్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన నాగోబా జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని మోలిక వనతులు దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భక్తులతో కళకళలాడుతున్న కేస్లాపూర్
జిల్లా కలెక్టర్ రాజార్జి షా మాట్లాడుతూ, గిరిజనుల ఆచార వ్యవహారాలకు నాగోబా జాతర ఒక ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా, పారిశుధ్యం, వైద్య శిబిరాల ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం దర్బార్లో స్వీకరించిన ఆర్జీల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ, జాతర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. అంతకుముందు మెస్రం వంశీయులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి నాగోబా దేవత చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్, వివిధ శాఖల అధికారులు, మెస్రం వంశీయుల పీఠాధిపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: