తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రముఖ నటి శ్రియా (Shriya) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంది. తల్లి కూతురుతో కలిసి బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియా పాల్గొంది. కుమార్తె రాధ శరణ్ ను ఎత్తుకుని తల్లి నీరజ తో కలిసి సుప్రభాత సేవలో పాల్గొంది. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రియా (Shriya) కు ఆశీర్వచనాలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో దర్శనానికి వచ్చిన శ్రియా, ఆలయం ముందు భక్తులని చూసి సరదాగా కొందరిని పలకరించింది.
Read Also: Aadarsha Kutumbam: వెంకటేశ్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: