శబరిమల (Sabarimala) సన్నిధానం వద్ద భక్తులపైకి ఒక ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 9 మంది భక్తులు గాయపడ్డారు.వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సన్నిధానం (Sabarimala)నుంచి కొండ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఏటవాలుగా ఉన్న రహదారిపై ట్రాక్టర్ అదుపు కోల్పోయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సన్నిధానం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: AP: 2026 లో‘కలలకు రెక్కలు’ పథకం అమలు!
పోలీసులు విచారణ
ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో ఐదుగురు ఉన్నారని పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు.తీవ్రంగా గాయపడిన భక్తులందరినీ వెంటనే పంబలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: