📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dalai lama: ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడిపై సమగ్ర గ్రంథం

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచం అత్యంత గౌరవించే ఆధ్యాత్మిక నాయకులలో ఒకరైన పద్నాలుగో దలైలామా (Dalai lama) టెన్జిన్‌ గ్యాత్సో దివ్య జీవిత ప్రయాణంపై సమగ్రమైన, విశేషాలతో కూడిన గ్రంథం ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. ప్రముఖ జీవిత చరిత్రల రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌, దలైలామా జీవితాన్ని ఎంతో లోతుగా, సునిశితంగా పరిశోధించి ఈ మహత్తర పుస్తకాన్ని రూపుదిద్దారు. దలైలామా జీవిత విశేషాలపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన ఈ గ్రంథం వాటన్నింటికంటే భిన్నంగా, అరుదైన వాస్తవాలు, ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని సంఘటనలతో నిండి ఉంది. డా. యాదవ్‌ దాదాపు ఐదు పుస్తక భాగాలుగా ఈ జీవిత చరిత్రను అంకితభావంతో సిద్ధం చేశారు.ఈ ప్రతిష్టాత్మక గ్రంథం ఈ ఏడాదే ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇది దలైలామా 90వ జన్మదిన ఉత్సవాలు ఆరంభమయ్యే జులై 9, 2025 సందర్భంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

Dalai lama: ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడిపై సమగ్ర గ్రంథం

దలైలామా ప్రశంసలు – అరవింద్ యాదవ్ పట్ల కృతజ్ఞత
తన జీవిత ప్రయాణంపై ఇంత సమగ్రమైన పుస్తకం తీసుకొచ్చిన డాక్టర్ అరవింద్ యాదవ్‌ను స్వయంగా దలైలామా అభినందించడం విశేషం. “టిబెట్‌ చరిత్రను, బౌద్ధం యొక్క తాత్వికతను అర్థం చేసుకోవడంలో అరవింద్‌ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అధ్యయనం అద్భుతం. నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది” అని దలైలామా ప్రశంసించారు. బాల్యం నుంచి ప్రవాసం దాకా తన జీవనయానాన్ని ఈ పుస్తకం చక్కగా ఆవిష్కరించిందని దలైలామా (Dalai lama) అన్నారు. ఇది టిబెట్‌ ప్రజల ఆకాంక్షలను, వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసిందని పేర్కొన్నారు. మానవ విలువలు, మత సామరస్యాన్ని పెంపొందించడంలో, టిబెట్‌ సంస్కృతి, పర్యావరణాన్ని కాపాడటంలో, ప్రాచీన భారత జ్ఞానం పట్ల ఆసక్తిని రేకెత్తించడంలో తాను చేస్తున్న కృషికి ఈ పుస్తకం దివిటీ పట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టిబెట్‌ వారసత్వాన్ని, దాని పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేసేలా పుస్తకం రాస్తానని 2022లో డాక్టర్ యాదవ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని దలైలామా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వాగ్దానాన్ని నిలబెట్టిన రచయిత
ఈ పుస్తకం ముందుమాటలో ప్రముఖ రచయిత, రాజనీతిజ్ఞుడు డాక్టర్ కరణ్ సింగ్ మాట్లాడుతూ, “దలైలామా (Dalai lama) జీవితం, ఆయన గొప్ప విజయాల గురించి చాలా మందికి తక్కువ తెలుసు. ఆయన ప్రయాణాన్ని సమగ్రంగా చూపించే ఒక జీవిత చరిత్ర రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు అరవింద్‌ యాదవ్‌ తన విస్తృత అధ్యయనంతో ఈ గొప్ప పనిని ఎంతో శ్రద్ధగా చేశారు. ఆయనను మనసారా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు. కాగా, ఈ పుస్తక రచయిత డా. అరవింద్ యాదవ్ హైదరాబాద్‌లో పుట్టిపెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్, హిందీ పూర్తి చేసి, సైన్స్, సైకాలజీ, లా వంటి అనేక రంగాలలో పరిజ్ఞానం సంపాదించారు. దక్షిణ భారతదేశ రాజకీయాలు, సంస్కృతిపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. విస్తృత పర్యటనలు, క్షేత్ర స్థాయి అనుభవం ఆయన రచనలకు, విశ్లేషణలకు బలాన్నిస్తాయి. దలైలామాపై రాసిన ఈ తాజా గ్రంథంతో డా. యాదవ్ లోతైన పరిశోధన సామర్థ్యం, పాఠకులను కట్టిపడేసే కథనం మరోసారి రుజువవుతాయి. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయులైన ఒక ఆధ్యాత్మిక గురువు కాంతిమంతమైన జీవితంలోని తెలియని కోణాలను ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది. ఈ అద్భుతమైన జీవిత ప్రయాణంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి!

Read Also: Pushkar Singh Dhami: సజావుగా ఛార్ ధామ్ యాత్ర..పుకార్లకు తెరదించిన సీఎం పుష్కర్ సింగ్

A comprehensive treatise Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu on the eminent spiritual leader Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.