📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రయాగ్ రాజ్‌లో బస చేసేందుకు బెస్ట్ ఆశ్రమాలు.. తక్కువ ధరకే లభ్యం..

Author Icon By Divya Vani M
Updated: November 30, 2024 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళా, ఈసారి ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు నిర్వహించబడుతుంది. త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.

మహా కుంభమేళాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నవారు ముందస్తుగా బసకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో హోటల్ ధరలు ఆకాశాన్నంటవచ్చు, అందుకే బడ్జెట్‌ అనుగుణంగా ఆశ్రమాలు, ధర్మశాలలు వంటి చౌకైన వసతుల గురించి ముందే తెలుసుకోవడం బెటర్.ఈ పవిత్ర నగరంలో ఉన్న పురాతన ఆశ్రమాల్లో ఒకటైన భరద్వాజ ఆశ్రమం, బడ్జెట్ ప్రయాణికులకు ఉత్తమ ఎంపిక. ఇక్కడ గదుల అద్దెలు రూ. 500-1000 మధ్య ఉంటాయి. AC, నాన్-AC గదుల ఎంపికలు అందుబాటులో ఉండటంతో మీ అవసరాలకు తగ్గట్టుగా బుక్ చేసుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఈ ఆశ్రమానికి అదనపు ప్రయోజనం.శాంతి మరియు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తున్న వారికి ఇది ఒక ఆదర్శ ప్రదేశం.జైన ధర్మశాల తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన వసతి కోసం ప్రసిద్ధి చెందింది.

ఇది అజంతా సినిమా థియేటర్ సమీపంలోని చాంద్ జీరో రోడ్డులో ఉంది. ఇక్కడ రెండు పడకల నాన్-AC గదులు రూ 600 నుండి లభిస్తాయి,ఇతర గదుల అద్దెలు రూ 500-1500 మధ్య ఉంటాయి.ఇక్కడ శుభ్రతతో పాటు ప్రాథమిక సదుపాయాలు అందించబడతాయి.ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత సేవా ఆశ్రమం బడ్జెట్ ప్రయాణికులకు మరొక అద్భుత ఎంపిక.ఇక్కడ సింగిల్ బెడ్ నుంచి డబుల్ బెడ్ గదులు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి.ఈ ఆశ్రమం తులారామ్ బాగ్ MG రోడ్డులో ఉంది.

ప్రత్యేకతగా వైఫై సౌకర్యం కూడా ఇక్కడ లభిస్తుంది.మహా కుంభమేళా సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఖాయం, కాబట్టి ముందుగానే బస కోసం ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం.ఆశ్రమాలు, ధర్మశాలలు వంటి వసతులను ముందుగానే బుక్ చేసుకుంటే మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయవచ్చు. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదేశాలను ఎంచుకోవడం, మీ ప్రయాణానుభవాన్ని మరింత ఆనందంగా మార్చే మార్గం.

Bharadwaj Ashram Budget Accommodation in Prayagraj Maha Kumbh Mela 2025 Prayagraj Kumbh Mela 2025 Triveni Sangam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.