📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తిరుమలలో 18 మంది టీటీడీ ఉద్యోగులపై బదిలీ వేటు

Author Icon By Divya Vani M
Updated: February 5, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఆ సంస్థలోని అన్యమత ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర చర్యలు తీసుకున్నారు. తిరుమలలో ఈ స‌మ‌యంలో మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నట్లు వార్తలు రావడం వివాదాస్పదంగా మారింది దీనిపై టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులపై వారి వివిధ రకాల ప్రకటనలపై బదిలీ చర్యలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్న తిరుమల ప్ర‌భావాన్ని దెబ్బతీచే వారిని గుర్తించి 69 మందితో కూడిన జాబితా రూపొందించారు.

జాబితాలో టీటీడీ ఉద్యోగులు రిటైర్ అయిన వారు కూడా ఉన్నారని చెప్తున్నారు వీరిని బదిలీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీకి చెందిన పలువురు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్లు వసతి గృహ వార్డెన్లు కలిపి మొత్తం 18 మందిని బదిలీ చేసినట్లు సమాచారం.ఈ చర్యల నేప‌థ్యంలో భక్తులు తిరుమల ప‌విత్రత‌కు ముప్పు తెచ్చే కార్య‌కలాపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరికొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరుమల పవిత్రతను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొండపై అన్యమత ప్రచారం ఈ సమయానికి పూర్తిగా నియంత్రించబడాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.భక్తుల విశ్వాసం నిలబెట్టుకునేందుకు తిరుమల త‌ర‌ఫున భారీ మార్పులు మొదలయ్యాయి. ఈ పరిణామాలు టీటీడీ సంస్కరణలకు దారితీస్తున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వీరిలో అన్యమత ప్రచారం లేదా వివాదాస్పద విషయాల్లో పాల్గొన్న వారిపై టీటీడీ చర్యలు తీసుకుంటుంది ఇది తప్పకుండా తిరుమల పరిరక్షణకు భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు దోహదపడుతుంది.

Anymatha tirumala TirumalaIntegrity TirumalaNews TirumalaTemple TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.