📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

Author Icon By Tejaswini Y
Updated: March 17, 2026 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YouTuber Vaishnavi Murder: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు అత్యంత దారుణంగా హత్య చేశాడు.

Read Also: Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు.

ప్రేమ వివాహం.. రెండేళ్ల కాపురం

మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి, కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబుతో యూట్యూబ్ వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. అయితే, హరిబాబు తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదిరించి వైష్ణవిని పెళ్లి చేసుకున్న హరిబాబు, అత్తగారి ఇంట్లోనే ఉంటూ రెండేళ్లుగా సంసారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వైష్ణవి ఇప్పుడు ఐదు నెలల గర్భవతి.

YouTuber Vaishnavi Murder: Husband kills YouTuber Vaishnavi without realizing she is pregnant

ఆస్తి తగాదాలు.. అర్థరాత్రి ఘర్షణ

కొంతకాలంగా హరిబాబు సొంత ఇంట్లో ఆస్తి తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా పెను గొడవకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన హరిబాబు, ఇంట్లోని కత్తిని తీసుకుని వైష్ణవిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

హత్య చేసిన అనంతరం మంగళవారం ఉదయం నిందితుడు హరిబాబు నేరుగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కళ్లముందే గర్భవతి అయిన కూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. మాదాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కుటుంబ సభ్యుల ఆవేదన.. ఉరిశిక్షకు డిమాండ్

“మా బిడ్డను పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అతనికి ఉరిశిక్ష పడాల్సిందే” అంటూ వైష్ణవి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని విచారిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమా? లేక మరేదైనా నేపథ్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

jagtial news Korutla Crime Telangana Crime News Vaishnavi Hari Babu YouTuber Murder Case YouTuber Vaishnavi Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.