Youtuber Vaishnavi Murder Case: వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్.. భర్త అరెస్ట్

Read Time:  1 min
Youtuber Vaishnavi Murder Case: వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్.. భర్త అరెస్ట్
FONT SIZE
GET APP

Youtuber Vaishnavi Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే కాలయముడిగా మారి, కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును కోరుట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.వైష్ణవి హత్యకు సంబంధించిన వివరాలను కోరుట్ల సీఐ మీడియాకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోరుట్ల మండలంలోని మాదాపూర్‌కు చెందిన దుర్గాప్రసాద్, రాణి దంపతుల కుమార్తె వైష్ణవి. కొంతకాలంగా వైష్ణవి వీడియోలు తీస్తూ యూట్యూబ్ ద్వారా పేరు తెచ్చుకుంది.

Read Also: Siddipet School Bus Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

కొద్దినెలల హరిబాబు అనే యువకుడితో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలకు కట్నం విషయంలో అంగీకారం కుదరలేదు. కట్నం ఇవ్వాలని హరిబాబు తల్లిదండ్రులు చెప్పగా, వైష్ణవి తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. కట్నం లేకుండా వివాహానికి అంగీకరించమని తల్లిదండ్రులు చెప్పడంతో హరిబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు.

అదనపు కట్నం కోసం వేధింపులు

ఆ తర్వాత కోలుకున్న హరిబాబు, పెద్దలను కాదని గత సంవత్సరం మే 29న వెంకటాపూర్ గ్రామశివారులో వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి దంపతులు అత్తారింటిలో ఉంటున్నారు. ఆ తర్వాత హరిబాబు,  తల్లిదండ్రులు కట్నం గురించి అడుగుతుండటంతో వైష్ణవి తల్లిదండ్రులు రూ.5 లక్షలకు రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు.

Youtuber Vaishnavi Murder Case: Husband arrested in Vaishnavi murder case
Youtuber Vaishnavi Murder Case: Husband arrested in Vaishnavi murder case

హత్య చేసి పరారీ.. చివరకు అరెస్ట్

గత కొన్నిరోజులుగా హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధింపులకు గురి చేశాడు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్తింటివారు కట్నం వేధింపులు ఆపలేదు. ఈ క్రమంలో నిన్న భర్త హరిబాబు భార్య వైష్ణవిని హత్య చేసి పరారయ్యాడు. వైష్ణవి విగతజీవిగా పడిఉండటంతో కోరుట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.