బిహార్ రాష్ట్రం గయా జిల్లాలో ఒక మహిళపై అంబులెన్స్‌లో అత్యాచారం (Woman raped in ambulance) జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24న బోధ్ గయాలో నిర్వహించిన హోంగార్డ్ నియామక పరీక్షకు హాజరైన 26 ఏళ్ల మహిళ శారీరక పరీక్ష సమయంలో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. అనంతరం అధికారుల ఆదేశాలతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
అసహాయ స్థితిలో అమానవీయ చేష్టలు
ఆ యువతి ఆరోపణల ప్రకారం, అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో అంబులెన్స్‌లోనే డ్రైవర్ వినయ్, టెక్నీషియన్ అజిత్ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అనంతరం స్పృహలోకి వచ్చిన తరువాత జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అరెస్టైన నిందితులు – దర్యాప్తు కొనసాగుతుంది
పోలీసులు నిందితులైన అంబులెన్స్ డ్రైవర్ వినయ్, టెక్నీషియన్ అజిత్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై తీవ్ర ఖండన వ్యక్తమవుతోంది. మహిళల భద్రత విషయంలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also : AP : సముద్రంలో అలజడి.. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు- APSDMA