Yerraguntla: యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

Read Time:  1 min
Yerraguntla
Yerraguntla
FONT SIZE
GET APP

Yerraguntla: యర్రగుంట్ల : సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును యర్రగుంట్ల పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కారులో భారీగా నగదును తరలిస్తుండడంతో పట్టుకున్నట్టు యర్రగుంట్ల సీఐ విశ్వనాధ్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు. ముద్దునూరు రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కారు ఆపి తనిఖీ చేశారు.

Read Also:Cyber Crime: సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

Yerraguntla
Yerraguntla: Rs. 2.52 crore cash seized in Yerraguntla

బ్యాగు తెరచి చూడగా రూ.2.52 కోట్ల నగదు లభ్యమయ్యింది. వాహనంలో ఇద్దరినీ ప్రశ్నించగా. తమది ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామం అని తాము ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి మీరావలి వద్దా గుమాస్తాలుగా పనిచేస్తున్నామని గుంతకల్లులోని శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్తున్నామని చెప్పారు. అయితే వాటికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వనాధ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.