మహిళకు మహిళే శత్రువువని సామెత ఈ ఉదంతం తెలిస్తే నిజమేననిపిస్తుంది. ఒక మహిళ సాటి మహిళకు అండగా నిలవాల్సింది పోయి ఆ స్త్రీల జీవితాలను,పాడుచేసేందుకు యత్నించేవారిని ఏం చేసినా తప్పులేదు. వారికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అనిపిస్తుంది.
TCS: కుప్పకూలుతున్న టీసీఎస్, ఆందోళనలో ఐటీ రంగం..
భక్తి ముసుగులో లైంగిక వేధింపులకు (Sexual harassment) పాల్పడుతున్నబాబా చర్యలను ఖండించి, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఆయనకు వంతపాడడం, ఆ బాబా క్రియలను సమర్థిస్తూ, కోరిన అమ్మాయిలను ఆయన వద్దకు చేర్చే బాధ్యత తీసుకోవడం సిగ్గుచేటు.
ఢిల్లీ (Delhi) లోని ఒక ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ లో 17మంది విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా అకా చైతన్యానంద సరస్వతి (Aka Chaitanya Nanda Saraswati) ముగ్గురు మహిళా సహాయకులను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
బాబా కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడం,బెదిరించడం. లైంగిక కార్యాలకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో శ్వేతా శర్మ (అసోసియేట్ డీన్), భావన కపిల్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), కాజల్ (సీనియర్ ఫ్యాకల్టీ)అనే మహిళలను అరెస్టు చేశారు.
వీరిని విచారిస్తున్న సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. బాబా (Baba) సూచనల మేరకే తాము పని చేశామని ఆ మహిళలు ఒప్పుకున్నారు. క్రమశిక్షణ మరి కొన్ని సాకులతో విద్యార్థినులపై లైంగికంగా ఒత్తిడి తెచ్చేవారమని మహిళలు తెలిపారు.

వెలుగులో సంచనల విషయాలు
చైతన్యానంద సరస్వతి పని చేసిన వసంత కుంజ్ (Vasantha Kunj) లోని శ్రీశారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ లో 2016లో చదివిన విద్యార్థి మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. స్వామిజీకి అమ్మాయి నచ్చితే చాలు సౌకర్యాలతో గది లభించేదని తెలిపాడు. అంతేకాదు బ్లాక్ బెర్రీ, ఆపిల్ లాంటి ఖరీదైన ఫోన్లను కూడా ఇచ్చేవాడని చెప్పాడు.
దాని తరువాత అమ్మాయిలు వాడుతున్న ఫోన్లను ఆయన కూడా యాక్సెస్ చేసే సౌకర్యం పొందేవాడని.. చాట్ లు, సందేశాలు డిలీట్ చేయగలిగే ఏర్పాట్లు కూడా చేసుకున్నాడని విద్యార్థి తెలిపారు. ఆ ఫోన్లతో ఫ్యామిలీ, బంధువులతో మాట్లాడవద్దని చెప్పేవాడని అన్నాడు.
బాబాను బలంగా నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు
బాబాకు దుబాయ్ షేక్ తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఒక అమ్మూయి దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. దుబాయ్, యూఏఈల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాడని.. సెక్స్ రాకెట్ (sex racket) గురించి మాత్రం తనకు తెలియదని తెలిపారు.
బాబాను అమ్మాయిల తల్లిదండ్రులు బలంగా నమ్మేవారని.. అందుకే ఇనిస్టిట్యూట్ లో చేర్చేవారని, 2016లో చాలా ఘోరాలు జరిగాయని.. ఇప్పుడు మరింత తీవ్రం అయినట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చాడు హాస్టల్ వార్డెన్లే దీనంతటికీ కారణమని.. వారే అమ్మాయిలను బాబా దగ్గరకు చేర్చే వారని..
దాని తరువాత వారిని బాబా ముగ్గులోకి లాగా అఘాయిత్యాలకు పాల్పడేవాని విద్యార్థి తెలిపాడు. ఇదిలా ఉండగా పోలీసులు కస్టడీలో ఉన్న చైతన్యానంద విచారణలో వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు తప్పుదో పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా అతనిలో ఎటువంటి షశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: