గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రాణిప్ ప్రాంతంలోని ఒక బంగారు (Gold) ఆభరణాల దుకాణంలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ మహిళ, దుకాణం యజమాని కళ్లలో కారం పొడి చల్లేందుకు ప్రయత్నించింది. అయితే, యజమాని అప్రమత్తతతో ఆ ప్రయత్నం విఫలమైంది. అతను వెంటనే ఆ మహిళను పట్టుకుని ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
Read also: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు
యజమాని ప్రతిఘటన, పోలీసుల దర్యాప్తు
అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో సోని అనే వ్యక్తికి చెందిన నగల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. దుకాణంలో యజమాని సోని ఒక్కరే ఉన్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న మహిళ లోపలికి ప్రవేశించింది. చోరీకి ఇదే సరైన సమయమని భావించిన ఆమె, తన వద్ద తెచ్చుకున్న కారం ప్యాకెట్‌ను తీసి సోని కళ్లల్లో కొట్టడానికి ప్రయత్నించింది.
అయితే, ఆ మహిళ చర్యను క్షణాల్లో పసిగట్టిన సోని, వేగంగా తన ముఖాన్ని పక్కకు తిప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న యజమాని ఆ మహిళను గట్టిగా పట్టుకుని ప్రతిఘటించాడు. ఆ తర్వాత బలవంతంగా ఆమెను దుకాణం బయటకు లాక్కెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాణిప్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: