📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime: శరీరంపైనే సూసైడ్ నోట్ రాసి.. వివాహిత ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: July 18, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్తింటి వేధింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఓ ఇల్లాలు.. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. తన శరీరంపైనే సూసైడ్ నోట్ రాసి(Suicide Note).. వివాహిత(Married) ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో(Uttara Pradesh) వెలుగుచూసింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త, అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించి, చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితురాలు ఆరోపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భాగ్‌పత్ జిల్లాకు చెందిన మనీషా(Manisha) (28)కు నొయిడాకు చెందిన కుందన్‌ అనే వ్యక్తిత 2023లో వివాహం జరిగింది.

శరీరంపైనే సూసైడ్ నోట్ రాసి.. వివాహిత ఆత్మహత్య

కారుతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులు

పెళ్లి సమయంలో మనీషా తల్లిదండ్రులు కట్నం కిందట రూ.20 లక్షలు, బుల్లెట్ ఇచ్చారు. కానీ, వివాహమైన కొద్ది నెలల నుంచే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. కారుతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని వేధించారు. వారు చెప్పినట్టు చేయలేదని కరెంట్ షాక్‌తో చంపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రోజు రోజుకూ వారి ఆగడాలు ఎక్కువ కావడంతో తట్టుకోలేక జులై 2024లో పుట్టింటికి వచ్చేసింది. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు విడాకుల కోసం ప్రయత్నించారు.

పొట్ట మీద హిందీలో సూసైడ్ నోట్

మనీషా తన చేతులు, కాళ్లు, పొట్ట మీద హిందీలో సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో “నా చావుక కారణం భర్త కుందన్, అతడి కుటుంబమే” అని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఓ సెల్ఫీ వీడియోనకూ కూడా రికార్డు చేసిన మనీషా.. ‘తన భర్త, అత్త, మామ, మరిది కలిసి కట్నం పేరుతో వేధించారని కన్నీటిపర్యంతమైంది.

బలవంతంగా అబార్షన్
అలాగే, తనను చిత్రహింసలకు గురిచేశారని, ఒకసారి బలవంతంగా అబార్షన్ కూడా చేయించారని ఆమె వీడియోలో ఆమె వెల్లడించారు. ఆఖరికి అదనపు కట్నం తీసుకురాలేదని కరెంట్ షాకుతో చంపే ప్రయత్నం చేశారని తెలిపింది. 2023లో కుందన్‌తో పెళ్లైన కొద్ది నెలల వ్యవధిలోనే వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో, సూసైడ్ నోట్ ఆధారంగా కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Indore : మరోసారి క్లీన్‌ సిటీగా ఇండోర్‌.. అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము

#telugu News Crime News domestic issues India News mental health suicide case suicide note Tragic Incident woman suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.