📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Hospital :ఆస్పత్రిలో ఆడ శిశువును దొంగిలించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన మహిళ

Author Icon By Sudha
Updated: June 14, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాగల్‌కోట్ జిల్లా ఆసుపత్రిలో ఒక రోజు వయసున్న ఆడ శిశువు(baby girl)ను సాక్షి యాదవ్ అనే మహిళ దొంగిలించింది. ఆమె తల్లి, సోదరీమణులు(Sisters)కూడా ఈ దొంగతనంలో పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యుల అనుమానం మూలంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Hospital :ఆస్పత్రిలో ఆడ శిశువును దొంగిలించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన మహిళ

ముగ్గురు వ్యక్తులు సాయం
బాగల్‌కోట్ జిల్లా ఆసుపత్రిలో ఒక మహిళ ఒక రోజు వయసున్న ఆడ శిశువును దొంగిలించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. జిల్లాలోని రామదుర్గ తాలూకాలోని ఖాన్‌పేట్‌కు చెందిన సాక్షి యాదవ్ శిశువును దొంగిలించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో సాక్షికి ఆమె తల్లి, సోదరీమణులు సహా ముగ్గురు వ్యక్తులు సాయంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బాగల్‌కోట్ నవనగర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
సాక్షి శుక్రవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రికి వచ్చి అనుమతి తీసుకోకుండానే ప్రసూతి వార్డులో చేరింది. తనకు కూడా ఒక బిడ్డ పుట్టిందని ఆమె తన పొరుగువారికి చెప్పింది. ఈ రోజు ఉదయం 4.30 గంటలకు, ఆమె వేరొకరి బిడ్డను తీసుకొని తనతో పడుకోబెట్టుకుంది. తాను నర్సునని, కఫం తొలగిస్తానని చెప్పింది. ఆస్పత్రిలో ఎవరికీ అనుమానం రాకుండా కడకోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు ఒక నకిలీ కార్డు తయారు చేయించకుంది.
నిర్లక్ష్యం
అయితే ఆస్పత్రి వైద్యులకు అనుమానం వచ్చి సాక్షిని పరీక్షించగా ఆమెకు ప్రసవం కాలేదని నిర్ధారణ అయింది. తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ శిశువు తన వద్దకు ఎలా వచ్చిందని డివైఎస్పీ మహంతేష్ జిడ్డి వార్డులోని మహిళను ప్రశ్నించారు. ఆ శిశువు తనదేనని ఆ మహిళ వాదించింది. ఈ సంఘటన గురించి జిల్లా ఆసుపత్రి సర్జన్ మహేష్ కోణి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, ఆసుపత్రిలోని సంబంధిత వార్డులో నిర్లక్ష్యంపై కూడా విచారణ చేస్తామని చెప్పారు. బాగల్‌కోట్ ఎస్పీ అమర్‌నాథ్ రెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించి, మీడియాతో మాట్లాడుతూ.. కఫం తొలగించడానికి నర్సు బిడ్డను తీసుకెళ్లిందని అన్నారు. సంఘటన గురించి మేం సమాచారాన్ని సేకరిస్తున్నాం. జిల్లా ఆసుపత్రి సీసీ కెమెరాలను తనిఖీ చేస్తామని ఆయన అన్నారు.

Read Also:World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

baby girl Breaking News in Telugu Google news Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trying to steal Woman caught

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.