हिन्दी | Epaper

తల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు వీడియో వైరల్

Anusha
తల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు వీడియో వైరల్

హర్యానాలోని హిస్సార్‌లో మానవత్వానికే మచ్చలా మారిన ఘోర ఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం కన్నతల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు అమానుషంగా ప్రవర్తించింది. తల్లిని దారుణంగా కొడుతూ, “నీ రక్తం తాగుతాను” అంటూ దాడి చేసింది. ఈ భయంకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హిస్సార్‌లోని మోడర్న్ సాకేత్ కాలనీకి చెందిన రీటా అనే మహిళకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కానీ, భర్తతో గొడవలు రావడంతో కొంతకాలం పుట్టింటిలోనే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత భర్తతో సఖ్యత కుదరడంతో, అతడిని తన పుట్టింటికి రప్పించింది. తండ్రి మరణంతో ఒంటరిగా ఉన్న తల్లి నిర్మలాదేవి ఇంట్లోనే రీటా, ఆమె భర్త, అత్తగారితో కలిసి నివాసం ఉంటున్నారు.

ఆస్తిపై కన్నేసిన కూతురు

రీటా తన తల్లి పేరుమీద ఉన్న ఆస్తిని తన పేరిట రాయించాలని ఒత్తిడి తెచ్చింది. కురుక్షేత్రలో ఉన్న కుటుంబ ఆస్తిని రూ. 65 లక్షలకు అమ్మించి, ఆ మొత్తాన్ని కూడా తీసుకుంది. అయితే, మిగిలిన ఆస్తులను తనకు రాసిపెట్టమని తల్లిని బలవంతం చేయడం ప్రారంభించింది. తల్లి నిరాకరించడంతో ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది.

తల్లిపై దాడి

తనను ఇంటికి రాకుండా అడ్డుకుంటోందని, తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తోందని రీటా సోదరుడు అమర్ దీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఉద్యోగరీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే, ఇటీవల తన తల్లిపై రీటా చేస్తున్న హింసను సీసీటీవీ ద్వారా రికార్డ్ చేసి పోలీసులకు అందజేశాడు.

అమర్ దీప్ ఆవేదన

అమర్ దీప్ సింగ్ ఫిర్యాదు మేరకు రీటాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఒప్పుకోలేదని తల్లిని ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టింది. తనను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించేదని అమర్ దీప్ ఆరోపించాడు. ఇటీవల రీటా తల్లిని చిత్రహింసలు పెడుతున్న వీడియోను సంపాదించి పోలీసులను ఆశ్రయించాడు అమర్ దీప్ సింగ్. సీసీటీవీ ఫుటేజ్‌లో తల్లి నిర్మలాదేవిని రీటా తీవ్రంగా కొడుతూ మీదపడి కొరకడం ఈ వీడియోలో కనిపిస్తోంది. అమర్ దీప్ సింగ్ ఫిర్యాదు మేరకు రీటాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఒప్పుకోలేదని తల్లిని ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టింది. తనను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించేదని అమర్ దీప్ ఆరోపించాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870